భారీ షాక్.. 58 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత.. కారణం ఏంటి?
దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2025-26 విద్యాసంవత్సరంలో 58 ఇంజినీరింగ్ కాలేజీలు మూతబడ్డాయి. బీటెక్ కాలేజీలు మూతబడిన నేపథ్యంలో వివిధ సాంకేతిక విద్యాసంస్థల్లో దాదాపు 950 కు పైగా కోర్సులను రద్దు చేస్తునట్టు ఏఐసీటీఈ అధికారికంగా పేర్కొంది.
దీని ప్రకారం.. 2025-26 విద్యా సంవత్సరానికి ఫస్ట్ ఇయర్ విద్యార్థుల అడ్మిషన్ ను పూర్తిగా నిలిపివేస్తారు. అయితే ఇప్పటికే అందులో చదువుతున్న ఓల్డ్ స్టూడెంట్స్ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా వారు తమ డిగ్రీలను విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు వీలుగా ఏఐసీటీసీ అనుమతులు ఇచ్చింది. ఈ కాలేజీల మూసివేతతో ఉత్తర్ ప్రదేశ్ లో 12, మహారాష్ట్రలో 12 అలాగే మధ్య ప్రదేశ్ లో 8, తెలంగాణలో 4, పంజాబ్ లో 4, ఏపీలో 4 అలాగే రాజస్థాన్ లో 3 కళాశాలలు మూతపడ్డాయి.

అలాగే గుజరాత్, కర్ణాటక, తమిళనాడులో రెండేసి చొప్పున అలాగే హరియాణా, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొక్క కాలేజీ చొప్పున మూసివేశారు. ఇక మొత్తం 58 విద్యాసంస్థల్లో కేవలం మూడు గవర్న్ మెంట్, మిగిలిన 55 కళాశాలలు ప్రైవేట్ యాజమాన్యాల కింద నడుస్తున్నాయి.












Click it and Unblock the Notifications