18 ఏళ్ల కుర్రాడికి దొరికిన రూ.98 కోట్ల లంకె బిందెలు!

సాధారణంగా ఏదైనా కన్స్ట్రక్షన్ సైట్‌లో పనిచేసే కూలీలు, పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునే కుర్రాళ్లు అనుకోకుండా డ్రైనేజీ తవ్వకాల్లో దిగితే ఏముంటుంది? మహా అయితే మట్టి, పాత ఇనుప సామాన్లు లేదా ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రమే ఎదురవుతాయి. కానీ బెల్జియం దేశంలో మాత్రం ఏకంగా లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. మురికినీటి కాలువ పనులు చేస్తుండగా ఒక 18 ఏళ్ల కుర్రాడికి ఊహించని రీతిలో కోట్లాది రూపాయల విలువైన బంగారం లభించింది. ఈ అరుదైన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.

కాలువ తవ్వుతుంటే బంగారం మెరిసింది!

బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్‌ సమీపంలో ఉన్న సింట్‌-గిల్లిస్‌-డెండెర్‌మోండే ప్రాంతంలో ఈ విచిత్రం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో జేబు ఖర్చుల కోసం కోబ్‌ అనే 18 ఏళ్ల విద్యార్థి డ్రైనేజీ పైప్‌లైన్ల మార్పిడి పనుల్లో చేరాడు. తన తోటి కూలీలతో కలిసి మట్టి తవ్వుతుండగా ఉన్నట్టుండి భూమి అడుగున ఏదో లోహపు వస్తువు మెరుస్తూ కనిపించింది. మొదటి చూపులో అవి సాధారణ నాణేలు అనుకున్నప్పటికీ, మరింత లోతుగా తవ్వేసరికి అక్కడ ఒక పురాతన సంచి దొరికింది. దానిని తెరిచి చూడగా భారీ మొత్తంలో రాశిగా పోసిన బంగారు బిస్కట్లు, అరుదైన పురాతన నాణేలు ప్రత్యక్షమయ్యాయి.

Massive 98 Crore Gold Treasure Discovered by 18 Year Old Summer Worker During Sewer Repair Work

వందల ఏళ్ల నాటి బంగ్లా రహస్యం!

ఈ పురాతన నిధి స్థానిక వ్యాపారవేత్త దియోఫిలస్ వాన్ అస్షే నిర్మించిన దాదాపు 19వ శతాబ్దపు బంగ్లా కింద దాగి ఉందని తేలింది. 1899 కాలంలో ప్రారంభమై 1970ల వరకు నడిచిన ఒక మద్యం తయారీ సంస్థ యజమానికి ఈ ఆస్తి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పురాతన కట్టడాన్ని ఒక సామాజిక సేవా సంస్థ ఆఫీసుల కోసం పునరుద్ధరిస్తోంది. ఈ క్రమంలోనే పాత నేలమాళిగ గోడల మధ్య శతాబ్దాలుగా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిన నిధి బయటపడింది. దీని విలువ దాదాపు 9 మిలియన్ యూరోలు, అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.98 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు.

పోలీసుల ఆరా.. సొంతం ఎవరిది?

భారీ ఎత్తున లంకె బిందెలు లభించిన సమాచారం అందుకోగానే అక్కడి అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ నిధిని వెంటనే బ్రస్సెల్స్‌లోని ప్రభుత్వ భద్రతా కేంద్రానికి తరలించారు. ఈ నిధికి సంబంధించి ఎలాంటి నేరచరిత్ర లేదా దొంగతనం కేసులు లేవని నిర్ధారించుకోవడానికి పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే బెల్జియం చట్టాల ప్రకారం ఈ దొరికిన సంపద ఎవరికి చెందుతుందనే దానిపై పెద్ద చర్చే నడుస్తోంది. కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందుతుందా, స్థల యజమానులకా లేక పురాతన యజమాని వారసులకా అనేది ఐదేళ్ల విచారణ తర్వాతే తేలనుంది.

మేము ఆశపడలేదు.. కుర్రాడి నిజాయితీ!

అంత పెద్ద మొత్తంలో బంగారం లభించినప్పటికీ ఆ కుర్రాడు, అతడితో ఉన్న కూలీలు ఎలాంటి ఆశకు పోకుండా వెంటనే అధికారులకు సమాచారం అందించారు. "మామూలు రోజూలాగే పనులకు వచ్చాం.. అంత బంగారం చూసి షాక్ అయ్యాం. చిన్న మొత్తంలో ఉంటే పంచుకునేవాళ్లమేమో కానీ, అంత పెద్ద నిధిని మేము దాచుకోలేం కదా" అని ఆ కుర్రాడు సరదాగా పేర్కొన్నాడు. ప్రస్తుతం బెల్జియంలో ఈ నిధి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+