ఎయిర్ పోర్టులో పేలిన ప్రయాణికుడి తుపాకీ.. మహిళ, చిన్నారికి బుల్లెట్ గాయాలు..

ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి ఎయిర్ పోర్టులో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఒక ప్రయాణికుడు గన్ తీసుకెళ్తుండగా అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ గన్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మహిళ, చిన్నారికి బుల్లెట్ గాయాలు తగిలాయి. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో ఈ ఘటన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు జరిగింది.

ఏం జరిగిందంటే..? అజాంగఢ్ కు చెందిన కమ్లీష్ రాయ్ అనే ప్రయాణికుడు తన సతీమణితో కలిసి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఐఎక్స్- 1810 అనే విమానంలో ముంబై వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో తన వద్ద ఒక గన్, మ్యాగజైన్ ఉన్నాయని అతను ఎయిర్ పోర్ట్ అధికారులకు వివరించాడు. అయితే గన్ ను పరిశీలిస్తుండగా ఆ గన్ బ్లాస్ట్ అయింది. దాంతో ఒక బుల్లెట్ బయటకు వచ్చింది. ఈ ఘటనలో అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న ఇద్దరు సిబ్బంది సైతం గాయపడ్డారు. దీనిపై భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు.

varanasi airport Passenger gun goes off at Varanasi airport woman and child sustain bullet injuries

గాయపడిన ఆ ఇద్దరిని చికిత్స కోసం తరలించారు. మరోవైపు ఈ ఘటనపై స్థానిక పోలీసులకు అధికారులు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆయుధాన్ని తనిఖీ చేసే సమయంలో తూటా ఎలా పేలిందనే కోణంలో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది. నిత్యం ఎయిర్ పోర్ట్ లో రద్దీ ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం 24 గంటలూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినా ఈ షాకింగ్ ఘటన జరగడం అధికారుల్లో కలకలం రేపుతోంది. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+