క్రిస్పీ కార్న్ ఇలా చేస్తే బాగుంటుంది.. కార్న్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
కార్న్.. మొక్కజొన్న ఇది చాలా మందికి ఇష్టమైన ఆహారం. దీనిలో ఫుల్ గా ఫైబర్ ఉంటుంది. దీన్ని క్రిస్పీగా చేస్తే స్నాక్స్ గా తినటానికి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది కార్న్ . ఇంట్లోనే సులభంగా క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో, అసలు మొక్కజొన్నల వలన కలిగే ఆరోగ్య లాభాలు ఏమిటో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
మొక్కజొన్న పొత్తులు -3
శనగపిండి - 5 టేబుల్ స్పూన్లు
రైస్ ఫ్లోర్ - 3 టేబుల్ స్పూన్లు
కారం పొడి - 11/2 స్పూన్
పసుపు - కొద్దిగా
ఉప్పు - రుచికి తగ్గట్టు
చాట్ మసాలా - ½ టీస్పూన్
నూనె - వేయడానికి
నీళ్లు - కావాల్సినంత

చేసే విధానం:
మొక్కజొన్న పొత్తుల నుంచి గింజలు తీసి, ఉప్పు నీళ్లలో 5 నిమిషాలు ఉడికించి వడకట్టండి. ఒక గిన్నెలో శనగపిండి, రైస్ ఫ్లోర్, కారం, పసుపు, ఉప్పు కలపండి. కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేయండి.ఉడికించిన కార్న్ గింజలను ఈ మిశ్రమంలో ముంచి, నూనె వేడి చేసి, కార్న్ గింజలను మధ్యస్థ మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేయండి.
తీసి చాట్ మసాలా చల్లి వేడిగా సర్వ్ చేయండి.
మొక్కజొన్నలో ఉండే పోషకాలు
ఇలా చేస్తే బయట కొన్నట్టు క్రిస్పీగా, రుచిగా కార్న్ ఉంటుంది. ఎక్కువ నూనె పట్టకుండా ఎయిర్ ఫ్రైయర్‌లో కూడా చేసుకోవచ్చు. మొక్కజొన్నలు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, మలబద్ధకం తగ్గిస్తుంది. బరువు నియంత్రణలో ఉంచుతుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండుగా అనిపించి తినే మొత్తం తగ్గుతుంది.
కంటి చూపుకు, గుండె ఆరోగ్యానికి బెస్ట్
మొక్కజొన్నలో ఉండే ల్యూటిన్, జియాక్సాంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు కంటి చూపును కాపాడతాయి. ఇది గుండెకు చాలా మంచిది, ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్, పొటాషియం రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండి శరీరానికి శక్తి ఇస్తాయి. కార్న్ లో విటమిన్ బి, సి, మెగ్నీషియం, ఫాస్పరస్ లభిస్తాయి.
ఎక్కువ క్రిస్పీ కార్న్ తినొద్దు
కార్న్ ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరానికి రక్షణ ఇస్తుంది. ఎక్కువగా వేయించిన కార్న్ మంచిది కాదు.. వారానికి 1-2 సార్లు మాత్రమే తీసుకోవడం మంచిది. ఉడికించిన లేదా స్టీమ్ చేసిన కార్న్ మరింత ఆరోగ్యకరం.ఇంట్లోనే ఈ సింపుల్ క్రిస్పీ కార్న్ చేసి, ఆరోగ్యంగా తినండి..













Click it and Unblock the Notifications