రాధా TMT అందిస్తోన్న రైనో 600+ ఇప్పుడు ఆర్కిటెక్చర్ దృఢత్వం మరియు దీర్ఘాయువును పునర్నిర్వచిస్తోంది.

TMT తయారీలో రాధా TMT ఎల్లప్పుడూ మార్గదర్శిగా ఉండడంతో పాటు నాణ్యత మరియు శ్రేష్ఠతకు ఒక ప్రతీకగా నిలిచింది. ఆరు దశాబ్దాలకు పైగా వారసత్వం కలిగిన ఈ బ్రాండ్, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లో అత్యంత విశ్వసనీయ TMT బార్ తయారీదారు. చైర్మన్ సునీల్ సరాఫ్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ సరాఫ్ వారి దూరదృష్టితో కూడిన నాయకత్వంలోని రాధా TMT ఇప్పటికే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ తయారీదారుగా ప్రఖ్యాతి సాధించింది.
నాణ్యమైన ఉత్పత్తులు, సర్వీస్ మరియు అత్యద్భుతమైన వినియోగదారు సంతృప్తి అందించడంలో ఈ సంస్థ ప్రసిద్ధి చెందింది. రాధా TMT అనేది నిరూపితమైన బ్రాండ్‌గానే కాకుండా, ఈ విభాగంలో సరికొత్త మరియు అధునాతన LRF సాంకేతికతను ఉపయోగించే ఏకైక తయారీదారుగా ఉంటోంది. తెలంగాణలో TMT బార్‌లు ఎగుమతి చేసే ఏకైక సంస్థగా కూడా రాధా TMT ప్రసిద్ధి చెందింది.

"దక్షిణ భారతదేశంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న రాధా TMT, 2025 నాటికి ఏటా 1 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా ముందుకు సాగుతోంది"- అక్షత్ సరాఫ్, డైరెక్టర్ - సేల్స్ & మార్కెటింగ్.

Rhino 600 plus from Radha TMT with improved and strong architecture

రాధా TMT ఈ రోజు తన మరో అత్యాధునిక ఉత్పత్తి అయిన రాధా రైనో 600+ TMT బార్‌లను సగర్వంగా తీసుకొచ్చింది.రాధా రైనో 600+ TMT బార్‌లు 10% అధిక దృఢత్వం మరియు మరింత ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. ఇతర రకాల నిర్మాణ బార్‌ల కంటే ఇవి ఎక్కువ బాండింగ్ స్ట్రెంగ్త్ కలిగినవి. ఈ కొత్త వేరియంట్ అనేది మా అత్యాధునిక తయారీ కేంద్రంలోని సరికొత్త అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి నిర్ధిష్టమైన రీతిలో డిజైన్ చేయబడింది. 25 క్వాలిటీ చెక్‌లు మరియు పూర్తిస్థాయిలో సిద్ధం చేయబడిన ఎన్ఎబిఎల్ ల్యాబోరేటరీతో కూడిన కఠినమైన నాణ్యతా నియంత్రణ వ్యవస్థల ద్వారా ఈ బార్‌ల స్థిరత్వం, దృఢత్వం మరియు నాణ్యత నిర్ధారించబడుతోంది. భూకంపాలు, అగ్నిప్రమాదాలను తట్టుకోవడంతో పాటు తుప్పును నిరోధించేలా రాధా రైనో 600+ TMT బార్‌లనేవి అధిక నిరోధకత కలిగినవిగా రూపొందించబడ్డాయి.

రాధా రైనో 600+ బార్‌లనేవి గృహ నిర్మాణం కోసం తగిన TMT బార్‌లుగా ఉండడంతో పాటు మెరుగుపరచబడిన అనేక విశిష్టతలను అందిస్తాయి. అదనంగా వంగే గుణం ఉండడం వల్ల, పని పూర్తి చేసే విషయంలో సమయాన్ని తగ్గిచవచ్చు మరియు అదనపు బలం కలిగిన రాధా రైనో 600+ TMT బార్‌లు ఉపయోగించి సన్నని పిల్లర్లు నిర్మించడం ద్వారా అధిక కార్పెట్ ఏరియా ఆదా చేయవచ్చు. రాధా TMT అందిస్తున్న ఈ కొత్త ఉత్పత్తి ఇప్పుడు దక్షిణ భారతదేశం వ్యాప్తంగా విశ్వసనీయ మరియు అధీకృత డీలర్‌ల విస్తారమైన నెట్‌వర్క్ ద్వారా అందుబాటులో ఉంది మరియు త్వరలో ఇది భారతదేశం వ్యాప్తంగా కూడా అందుబాటులోకి రానుంది.
రాధా TMT ఎల్లప్పుడూ ఉత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులనే అందిస్తుంది. ఈ విషయంలో రాధా రైనో 600+ TMT బార్‌లు కూడా తిరుగులేనివి. సరికొత్త రాధా రైనో 600+ TMT బార్‌లనేవి మీ గృహ నిర్మాణాల దృఢత్వం మరియు దీర్ఘాయువును పునర్నిర్వచించడం కోసం సిద్ధంగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+