రాత్రి భోజనం చెయ్యగానే బెడ్ ఎక్కేస్తున్నారా? అలా చేయడం శరీరానికి ఎంత ప్రమాదమో తెలుసా?

రాత్రివేళ భోజనం ముగించుకున్న తరువాత చాలామంది రెస్ట్ తీసుకుంటారు. టీవీలో ఛానళ్లు తిప్పుతూనే, స్మార్ట్‌ఫోన్‌ చూస్తోనే గడిపేస్తారు. ఆ కొద్దిసేపటికే దుప్పటి కప్పుకొంటారు. వాకింగ్ చేయాలనో.. లేదా ఓ నాలుగు అడుగులు వేద్దామనే ఆలోచన చాలామంది రాకపోవచ్చు. ఉదయం నుంచి వేర్వేరు పనులు, ఆఫీసుల్లో ఒత్తిడి.. ఇలాంటి కారణాల వల్ల భోజనం చెయ్యగానే బెడ్ ఎక్కడానికే ప్రాధాన్యత ఇస్తారు. అలా చేయడం దీర్ఘకాలానికి ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

అలా చేయడం వల్ల మన శరీర బరువు మనకు తెలియకుండానే పెరుగుతందనేది వారి అభిప్రాయం. అది ఒబేసిటీకి దారి తీయొచ్చనే వాదనలు ఉన్నాయి. విధి నిర్వహణలోనో.. ఉదయం పూట వాకింగ్ లేదా జాగింగ్ చేశాం కదా అని సరిపుచ్చుకోవడానికి వీల్లేదని, మారుతున్న కాలానికి, ఆహార అలవాట్ల వల్ల రాత్రి భోజనం తరువాత కూడా కొంత వాకింగ్ చేయడం అత్యుత్తమని సూచిస్తున్నారు. భోజనం తరువాత కొద్దిసేపు కొద్దిసేపు నడవడం వల్ల ఎన్నో ప్రయోజనం ఉన్నాయని అంటున్నారు.

Research suggests that a short walk after taking dinner helps manage a persons blood sugar levels

శరీర బరువు ఇది నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, భోజనం తరువాత మరీ ఎక్కువ సమయం కాకుండా కొద్దిసేపు అటు ఇటు తిరిగినా సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల మెదడుకు కూడా విశ్రాంతి లభిస్తుందని చెబుతున్నారు. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడంతో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ చురుకుగా పనిచేస్తుంది. మెటబాలిజం శాతం మెరుగుపడుతుందని అంటున్నారు. పెద్దగా శ్రమ పడకుండా బరువు తగ్గించుకోవడానికి వాకింగ్ ఆఫ్టర్ డిన్నర్ అనేది బెస్ట్ ఫార్ములా అనేది నిపుణుల అభిప్రాయం.

భోజనం చేసిన వెంటనే వాక్ చేయడం వల్ల ప్యాంక్రియాటిస్‌లో ఇన్సులిన్ శాతం పెరుగుతుంది. ఇది గ్లూకోజ్‌ను కండరాలకు అందిస్తుంది. బ్రిస్క్ వాక్ చేయడం వల్ల డయాబెటిస్‌ను కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. రాత్రి భోజనం తరువాత నడక వల్ల గాఢ నిద్ర కూడా పడుతుంది. నిద్రలేమి దూరమౌతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల గుండెజబ్బులు దూరమౌతాయి. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగు పడుతుంది. మానసిక ప్రశాంతతను కల్పిస్తుంది. స్ట్రెస్ తగ్గడానికి ఇదో మంచి చిట్కాగా అభివర్ణిస్తున్నారు నిపుణులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+