మోహన్ రావుకు సిపి బ్రౌన్ అవార్డు

CP Brown Award
ఛందశ్శాస్త్రంలో కృషి, పరిశోధనకు గాను విరోధినామ సంవత్సరం బ్రౌన్ పురస్కారానికి బెజ్జారపు కృష్ణమోహన్ రావు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన తమ్మినేని యదుకుల భూషణ్ చెప్పారు. ఆయన ఛందశ్శాస్త్ర పరిశోధనా ఫలం ఆదికవుల్లో ఒక్కడైన నన్నెచోడుని కాలనిర్ణయం ఎన్నదగింది. ఆయన ఛందశ్శాస్త్ర వ్యాసాలను సంకలనం చేసి దేశీ బుక్స్ తరఫున ప్రచురిస్తామని యదుకుల భూషణ్ చెప్పారు. సిపి బ్రౌన్ ఛందస్సులో విశేష కృషి చేశారని, బ్రౌన్ స్ఫూర్తి పురస్కారాన్ని ఛందస్సును ఊపిరిగా చేసుకున్న మోహన్ రావుకు అందించడం సబబుగా భావిస్తున్నామని ఆయన అన్నారు.

మోహన్ రావు 1943లో జన్మించారు. మద్రాసులో ఎస్ఎస్ఎల్సీ చదివారు. తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. బెంగుళూర్ ఐఐఎస్సీలో పిహెచ్డీ పట్టా తీసుకున్నారు. 1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్ గా పనిచేశారు. తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా పనిచేశారు. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రాశారు. పాటలు, పద్యాలు కూడా రాశారు. సుభాషితాలను సంకలనం చేశారు.

వైదేహి శశిధర్ కు ఇస్మాయిల్ పురస్తారం తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు వైదేహి శశిధర్ ను ఎంపిక చేసినట్లు యదుకుల భూషణ్ చెప్పారు. నిద్రిత నగరం అనే కవితా సంకలనం ఈ అవార్డుకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. న్యూజెర్సీలో నవంబర్ 7వ తేదీన జరిగే ఇస్మాయిల్ సంస్మరణ సభలో అవార్డును బహూకరించనున్నట్లు చెప్పారు. గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్ కుమార్, పి. మోహన్ లకు ఈ అవార్డు లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+