Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వ్యవస్థలో జీర్ణమైన శ్రీశ్రీ

Sri Sri
మహాకవి, మహాప్రస్థాన గ్రంథకర్త శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద యెత్తున జరుగుతున్నాయి. శ్రీశ్రీ విప్లవ సిద్ధాంతాన్ని విశ్వసించాడు. విప్లవ కార్యాచరణను ప్రచారం చేశాడు. తన చిరునామా విరసం (విప్లవ రచయితల సంఘం) అని ప్రకటించుకున్నాడు. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితల ద్వారా మాటలతో మంటలు పుట్టించాడు. అయితే, శ్రీశ్రీ స్ఫూర్తి కొనసాగుతోందా అనేది నేడు సందేహాస్పదంగా మారింది. వర్గ రాజకీయాలను నమ్మిన శ్రీశ్రీకి ఇప్పుడు వర్గాలకు అతీతంగా బ్రహ్మరథం పడుతున్నారు. సమాజంలో రెండే వర్గాలుంటాయని,దోచుకునే, దోపిడీకి గురయ్యే రెండు వర్గాలు మాత్రమే ఉంటాయని ఆయన చెప్పారు. కానీ, శ్రీశ్రీని సొంతం చేసుకునే విషయంలో ఆ తేడా తొలగిపోయింది. సరిహద్దులు చెరిగిపోయాయి.

శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కె. రోశయ్య, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఏ మాత్రం సంశయించుకుండా పాల్గొన్నారు. నిజంగానే ఇంకా శ్రీశ్రీ విప్లవ రాజకీయాల ప్రతినిధిగానే కొనసాగుతూ ఉన్నట్లయితే అందుకు ఆస్కారం ఉండేది కాదు. అయితే పాలక వర్గాలు క్రమక్రమంగా కొంత మందిని సొంతం చేసుకుంటాయి. అలా శ్రీశ్రీని పాలక వర్గాలు సొంతం చేసుకున్నాయి. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ మీద శ్రీశ్రీ విగ్రహం స్థాపించడం అందుకు మరో ఉదాహరణ.

ఒక వైపు ప్రజారాజకీయాలతో విభేదిస్తూ మరో వైపు ఆ రాజకీయాలను ప్రచారం చేస్తున్న శ్రీశ్రీని ఆహ్వానిస్తున్నారంటే శ్రీశ్రీ పూర్తిగా వ్యవస్థలో జీర్ణమైపోయినట్లే. అలా ఆయన కవిత్వం ఇక నిర్వర్తించబోయే ప్రయోజనం కూడా ఉండదని గమనించాల్సి ఉంటుంది.కాగా, శ్రీశ్రీ రాజకీయాలతో మమేకం చెందుతున్నవారంతా ప్రభుత్వాలు ఆయనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన చెందడం అనూహ్యమైన పరిణామంగా భావించవచ్చు. శ్రీశ్రీ రాజకీయ విశ్వాసాలతో పూర్తిగా విభేదించే వారు ఇప్పుడు శ్రీశ్రీని అందరికన్నా ఎక్కువగా కీర్తిస్తున్నారు. ఏమైనా, శ్రీశ్రీ ఇక ఎంత మాత్రం పీడితుల కవిగా మిగిలే అవకాశం లేదు. సాహిత్యంలో ఆయన అగ్రస్థానంలో మాత్రం ఉంటాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+