• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డెస్క్ టాప్‌కు అతుక్కుపోతే రాదు

By Pratap
|

 Gurram Seetharamulu
ఇఫ్లూ లో కవిసంగమం పేరుతొ బుధవారంనాడు దాదాపు ఒక వంద మంది ప్రముఖ, అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న పిల్ల కవులు ఒక దగ్గరకు చేరారు, ఈ చేర్చడం వెనుక దీని వేదిక మా ఇఫ్లూ చరిత్ర కూడా చెప్పాలి. ఇక్కడ ఇంటర్ నుండి పిహెచ్‌డి చదివే వాళ్ళు ఉంటారు వాళ్ళే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 50 కి పైగా వివిధ దేశాల సాహితీ సంస్కృతులు కలబోసిన ఒక గొప్ప విశ్వ సంస్కృతుల కూడలి అది.

నేను 4 ఏళ్ళ కింద అక్కడ పరిశోధకుడి గా చేరా నాకు తెలిసి అక్కడ తెలుగు వాళ్ళు ఊడ్చే, తూడ్చే వాళ్ళు మాత్రమే తెలుగు ఉనికా !!అస్తిత్వమా!! అంటే అదేంటి తెలుగా ?? అన్నట్లు చూసే అదో వింత లోకం. ఆ వింత లోకంలో బుధవారం అంత మంది తెలుగు కవులు తమ కళల కలబోత చేసుకున్నారు. ఇది శాస్త్ర సాంకేతికం తెచ్చిన ఒక మంచో చెడో చెప్పడం మాత్రం కష్టం కానీ, విభిన్న మనస్తత్వాలు ఒక దగ్గరకు చేరడం మాత్రం జరిగింది .

ఇక్కడ కవిత్వం లోకానికి ఏం మంచి చేసుద్ది చెడు చేసుద్ది అని చేర్చించడం కంటే రాయాలి అనే తపన , అమాయకత్వం ముఖ్యంగా 20 నుండి 30 ఏళ్ళ వాళ్ళు బయటికి రావడం మంచి పరిణామం, మా ఇఫ్లూలో ఇలాంటివి నేను వచ్చాక ఒక 40 సమావేశాలు ఏర్పాటు చేశా. ఎన్నో సంస్మరణ , సాహిత్య , పుస్తక ఆవిష్కరణలు ఏర్పాటు చేసాం. కాకుంటే నిన్నటి మీటింగ్ నాకు హ్యాపీ గా అని పించింది యెంత అద్భుతంగా రాస్తున్నారు వీళ్ళు.

నాకు వ్యక్తిగతంగా ఈ కవులన్న, రాసేవాళ్ళు అన్నా ఇష్టం ఉండదు. కారణం నేను నమ్మే ప్రాక్టికల్ జీవితం. ఇలా కవిత్వ ఊహల్లో తేలే వాళ్ళ వల్ల ఏం జరుగుద్ది అనుకోవడం. ఇది నా అవగాహన లోపం కావచ్చు , కాకుంటే కవి సంగమానికి వచ్చిన వాళ్ళలో ఒక పది మంది అయినా సమాజ హితం కోరే వాళ్లుగా అసమ, విలోమ విలువలు తిరగ రాసే వాళ్ళుగా తయారవుతారు అనే చిన్న ఆశ నాకు .

వాస్తవానికి ఇఫ్లూలో గాలి పీల్చుకొనే తీరిక కూడా ఉండదు. పిహెచ్‌డి వాళ్లు కూడా ఒకటో తరగతిలాగా క్లాసుకి వెళ్తారు, చదవులో బాగా రాణిస్తారు , జాతీయ అంతర్జాతీ వ్యాప్త ఆలోచనలు కలబోసుకొని ఉంటారు. కాకుంటే ప్రేమ రాహిత్యం మానవతా విలువలు శూన్యం. కవుల వల్ల అయినా ఇక్కడ వాతావరణ ఏమయినా మారుద్దేమో అనే భావన నాది.

ఇక పొతే నిన్న ఎవరో చదివిన వాక్యం ఇది " రాయలేక పోతున్న కలం - ఆలోచనల్లో అక్కడే ఆగిపోయిన నా హృదయం - ఒక్కసారి నన్ను నీలో చూపిస్తూ , నా మనసుకు ఆలోచనలకు అయిన అంగవైకల్యాన్ని ఎత్తి చూపిస్తూ......... "

నిజమే రాయాలనుకున్నది రాయలేక పోవడం ఒక అంగ వైకల్యమే, తల్లి కడుపు లోంచి వచ్చిన పసివాడిలో మలినరాహిత్యం కవికి ఉండాలి, అలా ఉన్నప్పుడే కల్మషం లేని భావన బయటికి రావొచ్చు ఒక ప్రేమ భావన నిన్ను మంచి బావుకున్ని చేసుద్ది. అలా ప్రేమించే పసి మనసు ఉండాలి. అలాంటి పసి మనుసులు బుధవారంనాడి కలయికలో నేను ఎన్నో చూసా . వీటన్నిటి వెనుక యాకూబ్ అన్న తపన ఉంది ఆ తపన ఒక ఎదిగే మొక్కకు కంచ , వేసి పాదుపోసే చేయి లాగా ఉండాలి.

ఒకటి నిజం నేటి జీవితం అత్యంత సంక్లిష్ట మయినది దానికి ఒక చిన్న నాలుగు లైన్లు సాంత్వన ఇవ్వవు ఒక కవి అన్నాడు ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు మేత. నిజమే, మనం పీపాలు పీపాలు సిరా వొలక బోస్తున్నాం నిత్యం ఎంత హింస చూస్తున్నాం !! మరి ఏది మార్పు , ఆ మార్పు నాలా డెస్క్ టాప్ కు అతుక్కుపోతే రాదు అనే స్పృహ ఉంది. అది మన కవిసంగమానికి కూడా ఉండాలని అలా ఉండే క్రమాన్ని "కవిసంగమం" వేగవంతం చేయాలనీ ..

- గుర్రం సీతారాములు 'కవి సంగమం'పై

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Wednsday was really a wonderful day in my life . I will surely remember this 15-8-2012 independence day because of "kavi sangamam "(కవి సంగమం ) a poets meet . the poets of Facebook .EFLU has become a place to record these moments in the books of Telugu literature - Gurram Seetharamulu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more