ఆధునిక సాహిత్యానికి ప్రాధాన్యం

జైపూర్: ‘మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం' మూడవ రోజు మరిన్ని యువ సాహితీవేత్తల సాహిత్య ప్రసంగాలతో బహు ముచ్చటగా జరిగింది. ఆశ్చర్యకరమూ, ఆనందదాయకమూ అయిన అంశం ఏమిటంటే ఈ రోజు సాయంత్రం (అక్టోబర్ 1, 2013- మంగళవారం) నిర్ణీత సమయం అయిన ఐదు గంటలకి పాటల కార్యక్రమం తో మొదలలిత లుపెట్టబడే సమయానికి సభా ప్రాంగణం కొంచెం పల్చగా ఉన్నప్పటికీ, యువతరం సాహిత్య ప్రసంగాల తొలి వేదిక సమయమైన ఆరు గంటలకి సభా ప్రాంగణం ప్రేక్షకులతో నిండిపోయింది. ఈ రోజు శ్రీ లక్ష్మణాచారి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ (స్థాపకురాలు: శశికళా స్వామి) విద్యార్ధినీ, లలిత గీతాలని మధురంగా ఆలపించారు.

ఆ తరువాత సాంప్రదాయబద్ధంగా జరిగిన ప్రారంభ సభలో సుప్రసిద్ధ కవి జొన్నవిత్తుల, ప్రముఖ గాయకులు త్రినాథ రావు, డా. ద్వానా శాస్త్రి , వంశీ రామరాజు , వంగూరి చిట్టెన్ రాజు పాల్గొన్నారు. సుప్రసిద్ధ రచయిత్రి భద్రపాత్రుని రమణి ప్రత్యేక ప్రసంగం చేశారు.

 Third day of national youth literary meet

తరువాత 12 మంది యువ కవుల స్వీయ కవితా పఠనం లో కె. వెంకటేశ్, చిరంజీవి, మణికంఠ ల కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆధునిక కవిత, అనువాద సాహిత్యం మొదలైన అనేక అంశాలపై మాట్లాడిన వక్తలందరూ పెద్దల కన్నా మిన్నగా బాగా తమ వ్యాసాలను తాయారు చేసుకున్నారు. వారిలో బాలాజీ, శంకర్, రాధిక, శ్యాం ప్రసాద్ ల ప్రసంగాలు తలమానికంగా నిలిచాయి.

ఈ మూడవ రోజు సభని కూడా గంగిశెట్టి లక్ష్మీ నారాయణల సమర్ధవంతంగా నిర్వహించారు. రేపటి నుండీ అక్టోబర్ 5 దాకా జరిగే ఈ మహా సభలకి ప్రతీ రోజూ సాయంత్రం 5 నుండి జరిగే ఈ యువ సాహితీ సభలకు అందరూ ఆహ్వానితులే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+