వెంకటాపురం/ తెలంగాణా
ఇది గంధకపు భూమి
వొరానొక కోటి కలల దేహంపై లోపలి కఠారి వాన
రవ్వలు రవ్వలుగా ఎగుస్తున్న చీకటి
నేను నా పాటగాడి నెత్తుటి ప్రాకారాన్ని
వానితో జమ్మిపూల జాతరలో గల్లుమనే తెలంగాణని
వొరుసుకునే మూసి కన్నీరుతో
గుప్పుమన్న పాటగాడి గొంతులో
వొగరొగరు గాయాలు
వొలికిపోయే నేత్రాలు
ఈ భూమి కొలిమి ఇంక అంటుకుందిరా
తూటా వణికింది
వొకే వొక కోటి జన్మల మృత్యువు
దానితో తొడ చరిచిన దుఖ్కవీరుడు
లచ్చుమమ్మా నీ కొడుకు నా సుదీర్ఘ లోకాల వెలుగుల కిటికీ
గుండెనలరించి అలరించిన తెల్లగన్నేరు దీపం
కలల పాలపిట్ట
కొవ్వొత్తి నెత్తురు
కాపాడుకుంటాను
రాపాడి కొలుస్తాను
పాటని
మొత్తం ఈ భూమి మన్నుని తొలిచి
మలచిన దేహమిది
చలించే ఓ మట్టి జన్యువు
మిలియనొక్క పిడికిళ్లను దాల్చిన పెనుగర్భం
కొనదేలి పోతాను
పగిలిపోతాను
పాటలో నిద్రలు దూదిపింజలై ఎగిరిపోతాయి
వేయి పక్కటెముకల సందుల్లో












Click it and Unblock the Notifications