తెలుగు కవిత: ఆ-కలి

Posted By:
Subscribe to Oneindia Telugu

ఎంగిలి ఆకుల తొట్టి
నోరూరించే ఓ అనాథ ఆకలి!
వంపుసొంపుల వయ్యారిపై
కుర్రోళ్ళ మదిలో కోరికల ఆకలి!
ఉద్యోగికి పదోన్నతిలో
రాబోయే భత్యాల గంపెడు ఆకలి!
నాలుగురాళ్ళెనకేస్తే అలిగైనా
మొగుడిచేత గొలుసు కొనిపించే ఆకలి!
పరీక్షలో సాధించే ర్యాంకుకై
పరితపించే విద్యార్థి ఆకలి!
కూటికోసం గూటికోసం
నిరంతర శ్రామికుని పోరటమాకలి!
జనాన్ని ముంచి యెత్తులతో
గద్దెనెక్కే రాజకీయునిదొక ఆకలి!
బలహీనతల మాటున భక్తురాళ్ళపై
బాబాల దీవెనల వెనక దాగిన ఆకలి!
వడగళ్ళ కాళరాత్రైనా ఆకలి తీర్చుకోడానికి
విటుని ఆహ్వానించే కలి కాలపుటాకలి

 Kapila Ramkumar Kavitha Aakali in Telugu

అభివృద్ధి చెందే దేశాలపై
ఆధిపత్యం చెలాయించే సామ్రాజ్యవాద ఆకలి!
ఆ కళ్ళలోని ఆకలి
ఘోర కలిని సృష్టిస్తుందో
సాత్వికాన్ని పూయిస్తుందో
ఆధారపడేది ఆ ''కలి''పైనే!
కోటి విద్యలు/ యెత్తులు/జిత్తులు
కాటికి చేరేవరకు ఆకలే!
నిత్య వైవిధ్యపు పోరాటమే
జీవన గతుకుల గమనపు ఆరాటమే!
వస్తువు ఒక్కటే
ప్రసరించే దృక్కోణమే
కడుపు నింపినా
అకడుపు మండినా
రెండు గుణాలు సంతరించుకున్న
లోకపు రీతులలో
ఆకలి తీరులెన్నో!

- కపిల రాంకుమార్‌

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A senior poet in Telugu Kapila Ram Kumar described attitude of society in his poem Aa-kali

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి