కేవలం రూ. 7999లకే అదిరిపోయే ఫీచర్లతో 5జీ ఫోన్..
ఈరోజుల్లో అడుక్కునే వ్యక్తి నుంచి అంబానీ వరకూ అందరి చేతిలోనూ సెల్ ఫోన్ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఒక్కోసారి మనకి కావాల్సిన రేట్ లో ఫోన్ దొరికినా అవసరమైన ఫీచర్స్ ఉండవు. కానీ తక్కువ ధరకే అన్ని ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఓ సెల్ ఫోన్ కంపెనీ ప్రెజెంట్ చేస్తున్న ఆఫర్స్ మీకోసం ప్రత్యేకంగా..
పోకో తన కొత్త ఎంట్రీ లెవల్ 5G స్మార్ట్‌ఫోన్.. పోకో C75 5G ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ, 5G కనెక్టివిటీతో పాటు, ఆకర్షణీయమైన డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఎనిమిది వేలకే 5జీ ఫోన్ రావడం చాలా గుడ్ న్యూస్ అని అంటున్నారు.

పోకో C75 5G ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం..
4GB RAM + 64GB స్టోరేజీ
6.88 అంగుళాల HD+ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్
ఆండ్రాయిడ్ 14 HyperOS, స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ఆక్టా కోర్ ప్రాసెసర్,
50MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి
మొబైల్ లో 5160mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
సిల్వర్ స్టార్ డస్ట్, ఆక్వా బ్లిస్, ఎన్‌ఛాంటెడ్ గ్రీన్ రంగులలో ఫోన్ అందుబాటులో ఉంది.
5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, GLONASS, USB Type-C ఛార్జింగ్ పోర్ట్, IP52 రేటింగ్ - డస్ట్, వాటర్ రెసిస్టెంట్ లభించనున్నాయి. రూ. 8000 లోపు 5G ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 7999. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5% క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.












Click it and Unblock the Notifications