Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దారి తప్పిన ఇంటర్ స్టెల్లార్-ఎటు తిరిగి ఎటు వస్తుందో: నాసా ఆందోళన

మన సౌర వ్యవస్థలోకి ఇటీవల ప్రవేశించిన ఓ తోకచుక్క అంతరిక్ష పరిశోధకులకు సవాల్ విసురుతోంది. దాని కదలికలు ఆశ్చర్యానికి గురి చేస్తోన్నాయి. ఎటు తిరిగి ఎటు వస్తుందో.. అనే ఆందోళన వారిలో నెలకొంది. దీని ప్రభావం భూమిపై ఉండకపోవచ్చనడానికి గ్యారంటీ ఇవ్వట్లేదు.

దీనికి 3ఐ/అట్లాస్ (3I/ATLAS)గా పేరు పెట్టారు. ఇదొక ఇంటర్ స్టెల్లార్ తోకచుక్క. ఈ నెల ప్రారంభంలో దీన్ని గుర్తించారు. ఇలాంటి తోకచుక్కను గుర్తించడం ఇది మూడోసారి మాత్రమే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జూలై 1వ తేదీన చిలీలో గల నాసా ATLAS టెలిస్కోప్ గుర్తించింది.

An unexpected visitor spotted in our solar system

అధికారికంగా ఇది ఒక తోకచుక్కగా నిర్ధారించినప్పటికీ భిన్న వాదనలు వ్యక్తమౌతున్నాయి. ఇంటర్ స్టెల్లార్ కామెట్ అనే వాదనను హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ లోబ్ కొట్టిపారేస్తోన్నారు. దీన్ని గ్రహాంతరవాసులు పంపి ఉండొచ్చనే వాదనకు తెర తీశారు. న్యూస్ వీక్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఈ ఆబ్జెక్ట్ కక్ష్య, పరిమాణం, కదలికలు వంటి అంశాలు సహజంగా ఏర్పడినది కాదని ప్రొఫెసర్ లోబ్ తేల్చి చెబుతున్నారు. మనకంటే ఎంతో అభివృద్ధి చెందిన గ్రహాంతర నౌక లేదా ఓ ప్రోబ్‌ అయి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ కామెట్.. సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య- భూమి కక్ష్యకు అయిదు డిగ్రీల లోపే ఉండటం యాదృచ్ఛికంగా కాదని స్పష్టం చేస్తోన్నారు.

ఇలాంటి యాదృచ్ఛిక ఘటనలు సంభవించే అవకాశం 0.2 శాతం మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు. ఈ తోకచుక్కపై పరిశోధనలు చేపట్టిన ఇతర శాస్త్రవేత్తలు మాత్రం లోబ్ వాదనలతో విభేదిస్తోన్నారు. దీని మూలాలు సహజమైనవి కాదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్లానెటరీ డిఫెన్స్ హెడ్ రిచర్డ్ మోయిస్ల్ చెప్పారు.

సాధారణ తోకచుక్కలతో పోల్చుకుంటే ఈ ఇంటర్ స్టెల్లార్ చాలా భిన్నంగా ఉండటం లోబ్ వాదనలకు బలాన్ని చేకూరుస్తోంది. దీని కక్ష్య పరిధి.. ఇతర తోకచుక్కలతో పోల్చుకుంటే అధికంగా ఉంటోంది. దాదాపు 20 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండటం.. ఓ సాధారణ గ్రహశకలం కంటే పరిణామంలో చాలా పెద్దదిగా ఉండటం చర్చనీయాంశమైంది.

త్వరలోనే ఈ తోకచుక్క.. వీనస్, మార్స్, జుపీటర్ గ్రహాలకు అతి సమీపంలో నుంచి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ దాని కదలికలు సహజ సిద్ధంగా ఉంటే ఇలాంటి అలైన్మెంట్ ఏర్పడే అవకాశం 0.005 శాతం మాత్రమేనని లోబ్ పేర్కొన్నారు. అక్టోబర్ 29వ తేదీన ఈ తోకచుక్క సూర్యుడికి అత్యంత సమీపంగా వస్తుంది.

సూర్యుడి సమీపానికి వచ్చిన సమయంలో భూమి నుండి దీనిని చూడటం కష్టతరమౌతుంది. భూమి నుంచి హ్యాండిల్ చేసే టెలిస్కోపుల కంటికి చిక్కకుండా ఉండటానికి గ్రహాంతరులు ఉద్దేశపూర్వకంగానే ఈ తోకచుక్క కదలికలను అలా సెట్ చేసి ఉండవచ్చని లోబ్ అనుమానం వ్యక్తం చేశారు.

Hubble Space Telescope images of interstellar comet 3I/ATLAS are out! These were taken 5 hours ago. Plenty of cosmic rays peppering the images, but the comet's coma looks very nice and puffy. Best of luck to the researchers trying to write up papers for this... archive.stsci.edu/proposal_sea... 🔭

[image or embed]

— astrafoxen (@astrafoxen.bsky.social) July 22, 2025 at 2:58 AM

ఈ స్పేస్ ఆబ్జెక్ట్ లో సాధారణ తోకచుక్కలకు ఉండే లక్షణాలవీ కనిపించకపోవడం ఆయన వాాదనలకు మరింత బలాన్ని ఇచ్చినట్టయింది. స్పెక్ట్రోస్కోపిక్ పరిశీలనలలో తోకచుక్క వాయువుల జాడలు ఇందులో లేవని లోబ్ తెలిపారు. మోయిస్ల్ వాదన వేరుగా ఉంటోంది. తోకచుక్క లక్షణాలు కనిపించకపోవడానికి సహజ కారణాలు ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మన గెలాక్సీలోని ఏదో ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉండగా ఇది ఏర్పడి ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+