భారత్ లో యాపిల్ ఐఫోన్ ఫోల్డబుల్ డ్యూయో ఎంట్రీ: ఎక్స్ఛేంజ్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు
యాపిల్ తొలిసారిగా మార్కెట్‌లోకి తీసుకువస్తున్న ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయో అమ్మకాలు భారత్ లో మొదలయ్యాయి. బెంగళూరు సహా దేశవ్యాప్తంగా ఆ సంస్థకు ఉన్న అధికారిక అవుట్ లెట్లల్లో కొద్దిసేపటి కిందటే వీటి విక్రయాలు ఆరంభం అయ్యాయి. నేరుగా స్టోర్‌కు వెళ్లి కొనుగోలు చేయాలని ఆశించే వినియోగదారులకు నిరాశ తప్పకపోవచ్చు. యాపిల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ ఆర్డర్ చేసిన వారికి మాత్రమే ప్రాధాన్యత లభిస్తోంది.
నేరుగా స్టోర్లలో స్టాక్ లభించడం దాదాపు అసాధ్యమని, ఆన్‌లైన్ చెకౌట్ సమయంలో చూపించే స్టాక్, టైమ్ స్లాట్ ఆధారంగానే ఐఫోన్ డ్యూయో అమ్మకాలు ఉంటాయని యాపిల్ తెలిపింది. ఈ ఐఫోన్ డ్యూయో బేసిక్ వేరియంట్ 256 జీబీ మోడల్ ధర రూ. 2,99,900 గా నిర్ణయించారు. అలాగే 512 జీబీ వేరియంట్ ధర రూ. 3,24,900 గా ఉంటోంది. టాప్ ఎండ్ డ్యూయో 1 టీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 3,74,900 వరకు ఉంటుంది. 2 టీబీ మోడల్ ధర రూ. 4,49,900.

ఢిల్లీ సాకేత్, నోయిడా- డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా, బెంగళూరు- హెబ్బాళ, ముంబై- బీకేసీ, బోరివలి, పుణే- కోరేగావ్ పార్క్ లల్లో ఉండే యాపిల్ ఐఫోన్ అధికారిక స్టోర్ లల్లో వీటిని విక్రయానికి ఉంచారు. క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, లోటస్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ స్టోర్లలో ఈ డివైజ్ అందుబాటులో ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా స్టార్ వైట్, నైట్ స్కై అనే రెండు ఆకర్షణీయమైన రంగుల వేరియంట్లలో వినియోగదారులకు లభిస్తోంది.
కొత్త ఫోల్డబుల్ డివైజ్ కొనుగోలు చేసే వినియోగదారుల కోసం ఆపిల్ సంస్థ కొన్ని ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ సౌకర్యాలను కల్పించింది. ఐఫోన్ 13 లేదా ఆపై మోడళ్లను ట్రేడ్ ఇన్ చేయడం ద్వారా ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో గరిష్టంగా రూ. 81,500 వరకు క్రెడిట్ వేల్యూ పొందవచ్చు. దీనికి తోడు బ్యాంకుల కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటోంది.
అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఐఫోన్ డ్యూయో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 7,000 వరకు ఇన్ స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు చేసిన వారికి ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ టీవీ ప్లస్, ఆపిల్ ఆర్కెడ్ కు సంబంధించి మూడు నెలల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ బోనస్‌గా అందిస్తోంది. 7.6 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీ ఆర్ ఫోల్డింగ్ డిస్‌ప్లే, వెలుపల 5.4 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఇచ్చారు.
ఇన్ సైడ్ స్క్రీన్.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కన్నా 50 శాతం పెద్దగా ఉంటుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, వీడియో స్ట్రీమింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 20 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఐఓఎస్ 27.1 ఆపరేటింగ్ సిస్టమ్, అధునాతన ఆపిల్ ఇంటెలిజెన్స్, సిరి ఏఐ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. 48 మెగాపిక్సెల్ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్ ఇచ్చారు. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరాను అమర్చారు.














Click it and Unblock the Notifications
