శ్రీశైలం ఆలయంలో చురుగ్గా కార్తీకమాసం ఏర్పాట్లు: స్పర్శ దర్శనాలపై.. !!

ఇంకొద్దిరోజుల్లో పవిత్ర కార్తీకమాసం ఆరంభం కాబోతోంది. దీపావళి అమావాస్య మరుసటి రోజు నుంచే కార్తీకమాసం మొదలవుతుంది. ఈ నెలలో నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తెల్లవారు జామునే సముద్రం/నదీ స్నానం చేయడం, గంగమ్మ తల్లికి పూజలు చేయడం, దీపాలను వెలిగించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అయ్యప్ప భక్తులు మాలధారణ చేసేదీ ఈ నెలలోనే. శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి శైవక్షేత్రాలన్నీ కార్తీక శోభను సంతరించుకుంటాయి. ఈ నెల పొడవునా భక్తులు ఆలయాలను సందర్శిస్తుంటారు.

ఈ ఏడాది నవంబర్ 10వ తేదీన కార్తీకమాసం మొదలవుతుంది. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య భారీగా ఉంటుందీ మాసంలో. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. దీనిపై అధికారులు సమీక్ష నిర్వహించారు. సర్వదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం క్యూలైన్లతో పాటు క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లను పరిశీలించారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం కల్పించడమే తమ మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నారు.

Srisailam temple decked up for the auspicious month long Karthika Masam Elaborate arrangements

కార్తీకమాసంలో వచ్చే వారాంతపు రోజులు, సోమవారాలు, దీపోత్సవం, ఏకాదశి, పౌర్ణమి వంటి విశేష సందర్భాల్లో స్పర్శ దర్శనాలను కుదించడం లేదా రద్దు చేసే అవకాశాలు లేకపోలేదు. క్యూలైన్లలో భక్తుల భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ తనిఖీ చేశారు. సెలవు దినాలు, వీకెండ్ రోజులు, కార్తిక సోమవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోన్నారు.

ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లే కార్తీకమాసం: ఈ నెలకు మరో పేరు ఏంటో తెలుసా..?
ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లే కార్తీకమాసం: ఈ నెలకు మరో పేరు ఏంటో తెలుసా..?

దర్శన వేళలు, దర్శనానికి పట్టే సమయం వంటి వివరాలపై భక్తులకు పక్కా సమాచారం చేరవేసేలా ఏర్పాట్లు చేపట్టినట్లు ఈఓ శ్రీనివాసరావు వెల్లడించారు. క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే భక్తులకు మంచి నీరు, అల్పాహారం అందించాలని ఆయన అధికారులకు సూచించారు. క్యూలైన్లలో లైట్లు, ఫ్యాన్లు సజావుగా పనిచేసేలా పర్యవేక్షించాలని, విద్యుత్ వైరింగ్ మరమ్మతులు, ఫ్లోరింగ్ ప్యాచ్ వర్క్‌లను తక్షణమే పూర్తి చేయాలని ఇంజినీరింగ్ విభాగానికి ఆదేశించారు. అదనపు లడ్డూ కేంద్రాలు, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.

అన్నప్రసాద వితరణ భవన ఈఓ పరిశీలించారు. భక్తుల రాకకు అనుగుణంగా అన్న ప్రసాదాల వ్యవస్థను సిద్ధం చేయాలని అన్నారు. భక్తుల సంఖ్యను బట్టి మధ్యాహ్నం 3:30 గంటల వరకు అన్నప్రసాద వితరణను పొడిగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సాయంత్రం వేళ 7 గంటల నుంచే అల్పాహార వితరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్తిక మాసంలో శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ యంత్రాంగం, ఇంజినీరింగ్, భద్రతా సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నాయని ఈఓ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+