ఆపిల్ అదిరిపోయే ఆఫర్.. ఫ్రీగా AirPods, Apple Pencil !!

ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైన తరుణంలో తమ వార్షిక "Back to School" సేల్ ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన MacBook, iPad మోడళ్లపై స్టూడెంట్ డిస్కౌంట్లతో పాటు AirPods 4, Apple Pencil Pro, AirTags వంటి యాక్సెసరీలను కూడా ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ స్పెషల్ సేల్ ఆగస్టు 27, 2026 వరకు కొనసాగనుండగా.. కాలేజీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. అలాగే విద్యాసంస్థల్లో పనిచేసే బోధనా సిబ్బంది ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవచ్చు.

MacBook Air M5పై ప్రత్యేక ఆఫర్

M5 చిప్‌తో కూడిన MacBook Air (2026) విద్యార్థులకు రూ.1,37,900 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. అదనంగా, AirPods 4 లేదా 4 AirTags ప్యాక్ వాటిలో ఏదో ఒకటి ఉచితంగా పొందవచ్చు. అలాగే, రూ.5,000 అదనంగా చెల్లించి AirPods 4 (ANC) పొందవచ్చు. రూ.13,000 చెల్లించి AirPods Pro 3కి అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. MacBook Pro M5 సిరీస్‌పై కూడా డిస్కౌంట్ లభిస్తుంది.

apple-launched-its-annual-back-to-school-sale-as-huge-offers-on-macbook-ipad-models-also-free-gif

MacBook Pro లపై స్పెషల్ ఆఫర్..

MacBook Pro M5 (2025) - రూ.2,27,900
MacBook Pro M5 Pro (2026) - రూ.2,81,900
MacBook Pro M5 Max (2026) - రూ.4,62,900

ఈ మోడళ్ల కొనుగోలుపై కూడా AirPods 4 లేదా AirTags ప్యాక్ ఉచితంగా అందిస్తున్నారు. అదనపు చెల్లింపుతో AirPods 4 ANC లేదా AirPods Pro 3ను ఎంచుకోవచ్చు.

iPad Air, iPad Proపై ఆఫర్లు

iPad Air (2025) (M4 చిప్‌తో) - ప్రారంభ ధర: రూ.83,900

iPad Pro (2025) - ప్రారంభ ధర: రూ.1,27,900

ఈ రెండు మోడళ్ల కొనుగోలుపై Apple Pencil Proను ఉచితంగా అందిస్తున్నారు. అదనంగా వినియోగదారులు.. రూ.2,000కు AirTags ప్యాక్, రూ.2,000కు AirPods 4 రూ.7,000కు AirPods 4 (ANC), రూ.15,000కు AirPods Pro 3 వంటి ఎంపికలను కూడా పొందవచ్చు.

MacBook Neoపై రూ.10,000 తగ్గింపు

ఇటీవల ఆపిల్ విడుదల చేసిన MacBook Neo కూడా ఈ సేల్‌లో ప్రత్యేక ధరలకు అందుబాటులో ఉంది.

256GB స్టోరేజ్ మోడల్ - రూ.69,900

512GB స్టోరేజ్ (Touch IDతో) - రూ.79,900

ఈ రెండు మోడళ్లపై రూ.10,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. MacBook Neoలో Apple Silicon A18 Pro చిప్‌సెట్‌ను అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+