యాపిల్ ప్రియులకు గట్టి షాక్: ఇక కొనలేం బాబోయ్

యాపిల్ గాడ్జెట్స్ ప్రియులకు గట్టి షాక్ తగిలింది. భారత్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో తమ పలు పరికరాల ధరలను ఆ సంస్థ భారీగా పెంచింది. మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్స్, యాపిల్ టీవీ, హోమ్‌పాడ్స్ వంటి వివిధ కేటగిరీల పరికరాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొన్ని ప్రీమియం మోడళ్లపై ఏకంగా లక్ష రూపాయల వరకు అదనపు భారం పడింది. యాపిల్ అత్యంత ప్రజాదరణ పొందిన ఐఫోన్ సిరీస్ ధరలలో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయలేదు.

అంతర్జాతీయ మార్కెట్‌లో డ్రామ్, నాండ్ ఫ్లాష్ స్టోరేజ్ చిప్‌ల ధరలు విపరీతంగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని యాపిల్ యాజమాన్యం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ కీలక విడిభాగాల కొరత ఏర్పడిందని వివరించింది. విడిభాగాల వ్యయం పెరిగినందున ఈ ధరల పెంపు అనివార్యమైందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేశారు. వినియోగదారులపై భారం పడకుండా చాలా కాలం పాటు తామే ఈ అదనపు వ్యయాన్ని భరించామని, ప్రస్తుత పరిస్థితుల్లో పెంపు తప్పట్లేదని ఆయన పేర్కొన్నారు.

Apple says Unprecedented Memory and Storage Chip Shortages as Price Hikes on iPad and MacBook Begin

భారీగా పెరిగిన మ్యాక్‌బుక్, ఐప్యాడ్ ధరలు

తాజా ధరల సవరణతో మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో సిరీస్ మోడళ్లు భారీగా ప్రియం అయ్యాయి. 13 అంగుళాల ఎం5 మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రారంభ ధర రూ. 1,20,900 నుంచి రూ. 1,49,900 కు చేరింది. అలాగే భారత్‌లో ఎక్కువ మంది కొనుగోలు చేసే మ్యాక్‌బుక్ నియో ధర రూ. 10,000 పెరిగి రూ. 79,900 కు చేరుకుంది. ఐప్యాడ్ విభాగంలో కూడా బేసిక్ ఐప్యాడ్ ధర రూ. 39,900 నుంచి రూ. 49,900 కి పెరగగా, ఐప్యాడ్ ప్రో ప్రారంభ ధర రూ. 1.39 లక్షల మార్కును దాటింది.

ల్యాప్‌టాప్‌లతో పాటు డెస్క్‌టాప్ కంప్యూటర్ మ్యాక్ మినీ ఎం4 ధర రూ. 59,900 నుంచి రూ. 94,900 కి పెరిగింది. స్మార్ట్ హోమ్ విభాగంలో యాపిల్ టీవీ 4కే ధర రూ. 14,900 నుంచి రూ. 25,900 కి పెరగింది. హోమ్‌పాడ్ ధర రూ. 44,900 కు చేరింది. బడ్జెట్ ఆడియో డివైజ్ హోమ్‌పాడ్ మినీ ధర రూ. 10,900 నుండి రూ. 15,900 కు చేరింది. ది బెస్ట్ మోడల్ ఎం5 మ్యాక్స్ మ్యాక్‌బుక్ ప్రో ధర ఏకంగా లక్ష రూపాయలు పెరగడం ధరల తీవ్రతకు అద్దం పట్టింది.

యాపిల్ గాడ్జెట్స్ నూతన రేట్లివీ..

మ్యాక్‌బుక్ నియో- రూ. 69,900 నుంచి రూ. 79,900

మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం5 (13-inch) రూ. 1,20,900 నుంచి రూ. 1,49,900

మ్యాక్‌బుక్ ప్రో ఎం5 (14-inch)- రూ. 1,69,900 నుంచి 2,39,900

మ్యాక్‌బుక్ ప్రో ఎం5 మ్యాక్స్- రూ. 3,99,900 4,99,900

మ్యాక్ మినీ ఎం4- రూ. 59,900 నుంచి రూ. 94,900

ఐప్యాడ్ (11 జెన్)- రూ. 39,900 నుంచి రూ. 49,900

ఐప్యాడ్ ఎయిర్ (11-inch ఎం4)- రూ. 64,900 నుంచి రూ. 89,900

యాపిల్ టీవీ 4కే- రూ. 14,900 నుంచి రూ. 25,900

హోమ్‌పాడ్ మినీ- రూ. 10,900 నుంచి రూ. 15,900

ఈ నూతన ధరలు తక్షణమే మార్కెట్లలో అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా సప్లై చైన్ లో తలెత్తిన విడిభాగాల కొరత, రవాణా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.. యాపిల్ భారత్‌లో పండుగల సీజన్ తర్వాతి కాలంలో ఈ పెంపు జరగడం గమనార్హం. ఐఫోన్ సిరీస్ ధరలను ప్రస్తుతానికి యథాతథంగా ఉంచడం కస్టమర్లకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+