Artificial Intelligence: మహిళా ఉద్యోగులకు శాపం, బలి అవుతుంది వీరే!

కృత్రిమ మేధస్సు (Artificial Intelligence), ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ, ఆర్థిక సేవల రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు ఉద్యోగ భద్రతపై ముప్పు పెరుగుతోందని సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ తాజా నివేదిక హెచ్చరించింది. ఈ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు తమ మగ సహచరులతో పోలిస్తే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.

నివేదిక ప్రకారం, కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న మధ్య-స్థాయి వృత్తి మహిళలను టెక్, ఫైనాన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాల్లో డిజిటల్ పాత్రల కోసం పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తేలింది. ఇప్పటికే మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న ఈ రంగాల్లో, కఠినమైన నియామక ప్రక్రియలు ఆ అంతరాన్ని మరింత పెంచుతున్నాయని పేర్కొంది.

Artificial Intelligence Biased Hiring Systems Are Increasing Job Loss Risks for Women in Tech Fields

ప్రస్తుతం అనేక సంస్థలు వినియోగిస్తున్న ఆటోమేటెడ్ సీవీ స్క్రీనింగ్ విధానాలు మహిళా అభ్యర్థులకు అననుకూలంగా మారుతున్నాయని పరిశీలనలో వెల్లడైంది. పిల్లలు లేదా కుటుంబ సభ్యుల సంరక్షణ కారణంగా వచ్చిన వృత్తి విరామాలను ఈ వ్యవస్థలు పరిగణనలోకి తీసుకోవడం లేదని, అనుభవాన్ని పరిమితంగా మాత్రమే అంచనా వేస్తున్నాయని నివేదిక పేర్కొంది.

Artificial Intelligence వల్ల అంతరించిపోయే జాబ్స్..

రాబోయే పదేళ్లలో టెక్, ఆర్థిక, వృత్తిపరమైన సేవల రంగాల్లో దాదాపు 1.19 లక్షల క్లరికల్ ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల అంతరించిపోయే అవకాశముందని అంచనా వేశారు. ఈ ఉద్యోగాల్లో ఎక్కువ భాగం మహిళలే నిర్వహిస్తున్న నేపథ్యంలో, పెద్ద సంఖ్యలో మహిళలు ఉద్యోగ నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

అయితే, ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించడంపై సంస్థలు దృష్టి సారిస్తే, తొలగింపు చెల్లింపుల రూపంలో సుమారు 757 మిలియన్ల పౌండ్ల వరకు ఖర్చును ఆదా చేయవచ్చని నివేదిక తెలిపింది. గత సాంకేతిక అనుభవం కంటే అభ్యర్థుల సామర్థ్యం, అనుకూలతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించింది.

టెక్నాలజీ రంగానికి మహిళల గుడ్ బై..

పదోన్నతి అవకాశాలు లేకపోవడం, గుర్తింపు కొరత, తగిన వేతనాలు అందకపోవడం వంటి కారణాల వల్ల ప్రతి సంవత్సరం సుమారు 60,000 మంది మహిళలు టెక్నాలజీ రంగాన్ని విడిచిపెడుతున్నారని అంచనా వేయబడింది. ఇది డిజిటల్ ప్రతిభ లోటును మరింత తీవ్రమయ్యేలా చేస్తోందని నివేదిక పేర్కొంది.

సిటీ ఆఫ్ లండన్ మేయర్ డేమ్ సూసన్ లాంగ్లీ మాట్లాడుతూ, ప్రజలపై పెట్టుబడి పెట్టడం ద్వారా అపారమైన ప్రతిభను వెలికితీయవచ్చని అన్నారు. డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధికి మద్దతు ఇవ్వడం వల్ల బలమైన, స్థిరమైన బృందాలు ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే..

నివేదిక ప్రకారం, 2024లో మాత్రమే ఈ రంగాల్లో 12,000కు పైగా డిజిటల్ ఉద్యోగాలు భర్తీ కాకుండా ఖాళీగానే ఉన్నప్పటికీ, మహిళలను ఉద్యోగాల కోసం పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదని తేలింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2035 వరకు డిజిటల్ ప్రతిభ అంతరం కొనసాగి, యుకే ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+