నో ఛాన్స్..: నాసా లేటెస్ట్ రిపోర్ట్

Asteroid hitting Earth: అంతరిక్షంలో గతి తప్పిన ఓ గ్రహశకలం నిన్నటివరకూ భూమండలాన్ని వణికించింది. భయాందోళనలకు గురి చేసింది. 2032లో భూమిని ఢీ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయంటూ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇచ్చిన స్టేట్‌మెంట్ దీనికి ప్రధాన కారణం.

విశ్వాంతరాల్లో గ్రహ శకలాలు, ఉల్కాపాతాలు సర్వసాధారణమే. అవి దారి తప్పి దిశా తెన్నూ లేకుండా తిరుగాడుతుంటాయి. గతంలో అనేక అస్టరాయిడ్స్ భూమికి అత్యంత సమీపంలో దూసుకెళ్లిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. వీటన్నింటికీ భిన్నంగా తాజాగా ఓ గ్రహ శకలం మాత్రం భూమిని ఢీ కొట్టడానికి అవకాశాలు చాలావరకు ఉన్నాయంటూ ఇదివరకు నాసా స్పష్టం చేసింది.

Asteroid 2024 YR4 Safely Pass Earth In 2032 Says NASA

దీని పేరు అస్టరాయిడ్ 2024 వైఆర్ 4 (Asteroid 2024 YR4). దీని విస్తీర్ణం 177 అడుగులు. దాదాపుగా 54 మీటర్లు ఉంటుంది. ఓ అపార్ట్‌మెంట్ ఎత్తును పరిమాణంగా తీసుకోవచ్చు. అంత భారీగా గ్రహ శకలం కావడం వల్లే దీనికి సిటీ కిల్లర్ అని పేరు పెట్టింది. 2032లో భూమిని ఢీ కొట్టడానికి 3.1 శాతం అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

ఇప్పుడు తాజాగా దీన్ని సవరించింది నాసా. ఈ గ్రహ శకలం భూమిని ఢీ కొట్టడానికి గల అంచనాల శాతాన్ని గణనీయంగా తగ్గించింది. 0.004 శాతానికి కుదించింది. అంటే- దాదాపుగా ఇది భూమిని ఢీ కొట్టబోదనే నిర్ణయానికి వచ్చినట్టే. భూ కక్ష్యకు సుదూరం నుంచి ఈ గ్రహశకలం విశ్వంలోకి దూసుకెళ్తుందని తెలిపింది.

ఈ మేరకు నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ అబ్జెక్ట్ స్టడీస్.. ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. ఇది చంద్రుడిని ఢీ కొట్టడానికి అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. దీనిపై తన అంచనాలను ఒక శాతం వరకు పెంచింది. మున్ముందు ఇది మరింత పెరగవచ్చని తెలిపింది.

అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి అనుబంధంగా పని చేస్తోన్న సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ ద్వారా ఎప్పటికప్పుడు వైఆర్4 కదలికలను గుర్తిస్తోన్నారు సైంటిస్టులు. ఈ గ్రహశకలం చంద్రుడిని ఢీ కొట్టడానికి గల అవకాశాన్ని ఇదివరకు 0.8 శాతంగా అంచనా వేయగా.. ఇప్పుడు దీన్ని ఒక శాతానికి పెంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+