Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Shubhanshu Shukla: అంతరిక్షంలో సరికొత్త చరిత్ర

ISRO: అంతరిక్ష పరిశోధనా సంస్థ.. యాక్జియమ్ 4. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి నలుగురు వ్యోమగాములను తీసుకెళ్లడానికి ఇస్రో.. ఈ మిషన్ ను చేపట్టింది. దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారాన్ని తీసుకుంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడ్డ ఈ మిషన్ కు నేడు ముహూర్తం కుదిరింది.

ఇంకాస్సేపట్లో అంటే.. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12:01 నిమిషాలకు అమెరికా ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ఐఎస్ఎస్ కు బయలుదేరనుంది. దీనికోసం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లో వాళ్లంతా అంతరిక్షంలోకి దూసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Axiom 4 Mission live updates in telugu  Indias Shubhanshu Shukla to create history in space

ఈ మిషన్ కు భారత్ సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. వైమానిక దళ వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. ఈ మిషన్ కు గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరిస్తోన్నారు. ఆయనతో పాటు స్లావోష్ ఉజ్నాన్స్ కీ, టిబోర్ కపు- హంగేరి, నాసాకు చెందిన పెగ్గీ విట్సన్.. ఐఎస్ఎస్ కు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్ డేట్స్ మీకోసం..

Jun 25, 2025, 2:02 pm IST

అంతరిక్ష కేంద్రానికి దూసుకెళ్లిన శుభాన్షు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు వెళ్లిన మరో ముగ్గురు వ్యోమగాములకూ విషెస్ చెప్పారు. వసుధైక కుటుంబకం అనే నినాదాన్ని భారత్ మరోసారి రుజువు చేసిందని అన్నారు.
Jun 25, 2025, 1:34 pm IST

శుభాన్షు శుక్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను తన వెంట అంతరిక్షంలోకి మోసుకెళ్లారని ప్రశంసించారు.
Jun 25, 2025, 1:33 pm IST

శుభాన్షు శుక్లాకు భారత వైమానిక దళం శుభాకాంక్షలను తెలియజేసింది. వైమానిక దళంలో ఆయన గ్రూప్ కేప్టెన్ గా పని చేస్తోన్నారు.
Jun 25, 2025, 12:50 pm IST

తనయుడి అంతరిక్ష ప్రయాణాన్ని తీవ్ర భావోద్వేగంతో శుభాన్షు శుక్లా తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వీక్షించారు. ఆ సమయంలో ఆయన తల్లి కన్నీరు పెట్టుకోవడం కనిపించింది.
Jun 25, 2025, 12:32 pm IST

నమస్తే, మై డియర్ కంట్రీ మెన్.. అని శుక్లా వ్యాఖ్యానించారు.
Jun 25, 2025, 12:30 pm IST

ఫాల్కన్ 9 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన తరువాత ఈ ప్రయాణం అద్భుతం (కమాల్ కి రైడ్) అంటూ శుభాన్షు శుక్లా వ్యాఖ్యానించారు.
Jun 25, 2025, 12:07 pm IST

Falcon 9
అమెరికా ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్
Jun 25, 2025, 12:03 pm IST

ఆక్సియమ్ 4 స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధమైందని స్పేస్ ఎక్స్ ప్రకటించింది.
Jun 25, 2025, 12:02 pm IST

భార్యను ఉద్దేశించి ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు శుభాన్షు శుక్లా. ఆమె సపోర్ట్ లేకుండా ఈ ప్రయాణం సాధ్యం అయ్యేది కాదని అన్నారు.
Jun 25, 2025, 11:58 am IST

గ్రూప్ కెప్టెన్ శుక్లా ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ ప్యాడ్ 39-Aకి వెళుతున్న సమయంలో `వందేమాతరం` గీతాన్ని ప్లే చేశారు.
Jun 25, 2025, 11:28 am IST

ఇదివరకు మూడుసార్లు ఈ ప్రయోగం వాయిదా పడింది. తొలుత మే 29 నుంచి జూన్ 8వ తేదీకి వాయిదా పడింది.ఆ తరువాత 10 నుంచి 11కు, అనంతరం 20 నుంచి నేటికి ఈ ప్రయోగం వాయిదా పడింది.
Jun 25, 2025, 11:05 am IST

Axiom 4
మొత్తం ఈ ఏడు అంశాలపై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుభాన్షు శుక్లా టీమ్ పరిశోధనలు సాగిస్తుంది.
Jun 25, 2025, 10:59 am IST

ఇంకాస్సేపట్లో ఆక్సియమ్ 4 స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లనున్న నేపథ్యంలో ఇస్రోకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Jun 25, 2025, 10:51 am IST

నలుగురు వ్యోమగాములు ఫాల్కన్ 9 రాకెట్ లో ప్రవేశించారు. ఆన్ బోర్డ్ అయ్యారని స్పేస్ ఎక్స్ సంస్థ వెల్లడించింది.
Jun 25, 2025, 10:48 am IST

గ్రూప్ కేప్టెన్ శుభాన్షు శుక్లా సహా స్లావోష్ ఉజ్నాన్స్ కీ, టిబోర్ కపు- హంగేరి, నాసాకు చెందిన పెగ్గీ విట్సన్.. ఐఎస్ఎస్ కు బయలుదేరి వెళ్లనున్నారు.
Jun 25, 2025, 10:46 am IST

అంతరిక్షంపై భారత్ సరికొత్త చరిత్రను లిఖించబోతోంది. నాసా సహకారంతో మొట్టమొదటిసారిగా మానవ సహిత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+