IT News: గూగుల్ ఉద్యోగికి స్టార్టప్ మైండ్ బ్లోయింగ్ షాక్.. రిక్రూటర్ రిప్లైతో కంగుతిన్న టెక్కీ
Google employee: ప్రస్తుత కాలంలో ఓ మంచి ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. పదుల సంఖ్యలో కోర్సులు చేసినా వాటిలో సరైన నైపుణ్యాలు లేవని కార్పొరేట్ కంపెనీలు పక్కన పెట్టేస్తున్నాయి. కనీసం నోరు కూడా తిరగని టెక్నాలజీ గురించి తెలుసా అని ఇంటర్వ్యూలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే వాటికి భిన్నంగా గూగుల్ ఉద్యోగినికి ఎదురైన చేదు అనుభవం తెలిసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన అన్నూ శర్మ Xలో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఓ స్టార్టప్ తనను రిజెక్ట్ చేయగా, అందుకు సంబంధించిన మెయిల్‌ను తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. సదరు కంపెనీలో ఉద్యోగానికి తనకు తగిన అర్హత ఉన్నట్లు తెలిపారు. అయితే తగిన దాని కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నందుకు కూడా రిజెక్ట్ చేస్తారని తనకు తెలియదంటూ షాక్ ఇచ్చింది.

స్టార్టప్ తనకు పంపిన తిరస్కరణ లేఖలో రిక్రూటర్ నిర్ణయానికి వివరణ కూడా ఇచ్చినట్లు అన్నూ శర్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'మీ రెజ్యూమ్‌ని సమీక్షించిన తర్వాత రోల్ అవసరాల కంటే మీ అర్హతలు ఎక్కువగా ఉన్నట్లు మేము గ్రహించాము. అధిక అర్హతలు ఉన్న అభ్యర్థులు సరిగా పని చేయరని, చేరిన కొంత కాలానికే కంపెనీ నుంచి నిష్క్రమిస్తారని మా అనుభవం సూచిస్తుంది' అని పేర్కొంది.
Didn't know you could be rejected for being too good 🥲 pic.twitter.com/mbo5fbqEP3
— Anu Sharma (@O_Anu_O) October 17, 2024
ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో యూజర్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. నమ్మశక్యం కావడం లేదని, హాస్యాస్పదంగా ఉందని చెబుతున్నారు. రోల్ అవసరాలకు మించి అర్హతలు ఉండటం అభినందనీయంగా ఉండాలి కానీ తిరస్కరణకు కారణం కాకూడదని పేర్కొంటున్నారు. కొన్ని కంపెనీలు నిజమైన ప్రతిభను గుర్తించడంలో ఎలా విఫలమవుతున్నాయో ఈ ఘటన ఆధారంగా అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఇదే విధంగా తమ జీవితాల్లో ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు.
మీరు కంపెనీలను భయపెట్టే స్థాయిలో అధిక అర్హత కలిగి ఉన్నారని ఊహించుకోమని ఓ యూజర్ చమత్కరించారు. ఈ అనుభవంతో స్వంత స్టార్టప్‌ని ప్రారంభించాలని మరొకరు సూచించారు. స్టార్టప్‌లు అర్హతలు మరియు అనుభవానికి ఏమాత్రం విలువ ఇస్తాయో తెలుస్తోందని మరో సోషల్ మీడియా వినియోగదారుడు తెలిపారు.












Click it and Unblock the Notifications