AI News: టెక్కీలకు శుభవార్త..! పేలిపోనున్న ఏఐ బబుల్.. సీక్రెట్ రిపోర్ట్ బయటకు..

AI Bubble: ప్రపంచ టెక్ రంగంలో మెుదలైన ఏఐ ఆందోళనలు క్రమంగా అనేక ఇతర రంగాలకు వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే ఐబీఎం, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ వాటి స్థానాలను ఏఐతో భర్తీ చేస్తామని ఇప్పటికే తెలిపాయి. ఏఐ ప్రభావంతో అనేక సాంప్రదాయ ఉద్యోగాలు పోతున్నాయి. టెక్కీలు సైతం ఏఐ స్కిల్స్ నేర్చుకుంటేనే తమకు మనుగడ ఉంటుందని కంపెనీలు చెబుతూ ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు ఏఐ స్కిల్స్ నేర్పిస్తున్నాయి.

అయితే ఇక్కడ ఉన్న అతిపెద్ద ప్రశ్న అసలు ఈ ఏఐ స్ప్రీ ఎన్నాళ్లు కొనసాగుతుందన్నదే. ఈ క్రమంలోనే ఏఐ భవిష్యత్తుపై బైదూ సీఈవో రాబిన్ లి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అతిపెద్ద బబుల్ బర్ష్ దిశగా నడుస్తోందని అన్నారు. ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పించలేనిదని ఆయన పేర్కొన్నారు. ఈ ఏఐ బబుల్ పగిలితే దాదాపు 99 శాతం ఏఐ కంపెనీలు దివాలా తీస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఏఐ బూమ్.. దీనికి ముందు జరిగిన టెక్ బబుల్స్‌, 1990ల చివర్లో జరిగిన డాట్ కామ్ బబుల్ వంటి వాటితో పోల్చారు. ఏఐ డెవల్పెమెంట్ పేరుతో ఓవర్ వ్యాల్యుయేషన్ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

Baidu CEO Robin Li AI bubble will burst sooner will vanish 99 artificial intelligence companies

ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చితి వాస్తవానికి ఏఐ పరిశ్రమకు మంచిదన్నారు. చివరికి ఏఐ బబుల్ పగిలినప్పుడు మార్కెట్లో ఫేక్ ఏఐ ఉత్పత్తులు, కస్టమర్ల డిమాండ్లను అందుకోలేకపోతున్న ఏఐ ఉత్పత్తులు కనుమరుగవుతాయని లి అన్నారు. అయితే ఈ పరిస్థితులు రావటానికి దాదాపు 10-30 ఏళ్లు సమయం పడుతుందని రాబిన్ లి అభిప్రాయపడ్డారు. అయితే ఇది పూర్తిగా ఉద్యోగాల్లో మనుషులను రీప్లేస్ చేయటానికి ముందుగానే బబుల్ పగలటం జరుగుతుందని తన అంచనాలను వెల్లడించారు.

ప్రస్తుతం ఏఐ బూమ్ టెక్కీలను ఆందోళనకు గురిచేస్తోంది. జాబ్ సెక్యూరిటీ ఏఐ లేకుండా చేస్తోందని వారు అంటున్నారు. కొందరైతే ఎన్నాళ్లుంటుందో తెలియని జాబ్స్ మావి అంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు, కారు, గృహోపకరణాలు, ఐఫోన్ అంటూ ఖరీదైన వస్తువులను ఈఎంల్లో కొనుగోలు చేసిన తర్వాత జాబ్ పోతే పరిస్థితి ఏంటనే ఆందోళన వారిలో అంతర్గతంగా ఉంది. పేరుకే లక్షల్లో జీతాలు అందుకుంటున్నా ఏఐ అభివృద్ధి వారిని నిరంతరం ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. ప్రధానంగా అధిక జనాభా ఉన్న భారత్ వంటి దేశాల్లో ఇది రానున్న కాలంలో ఉద్యోగ అవకాశాలను తగ్గిస్తుందనే ఆందోళనలు సైతం పెరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+