మండే ఎండలతో అలిసిపోతున్నారా.. 5000 లోపే బెస్ట్ కూలర్లు ఇవే !

ఏప్రిల్ నెలలోనే భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక మే లో సూర్యుడు విజృంభిస్తే ఇళ్ళలో నుంచి బయటికి వచ్చే వారే ఉండరు. ఇక ఇంట్లోనే ఉంటే ఉక్కపోతతో ఉడికిపోతున్నారు. ఫ్యాన్ వేసుకుంటే సరిపోదు.. ఏసీ దొరకాలంటే ఖర్చే ఎక్కువ. ఏసీ అంటే ఖర్చుతో పాటు కరెంట్ బిల్లు కూడా భారీగా ఉంటుంది. అందుకే ఈ రెండిటి మధ్య ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడితే ఈ ఆఫర్ మాత్రమం మీకోసమే. మిడిల్ క్లాస్ కుటుంబాలకు, బ్యాచిలర్స్‌కి మార్కెట్‌లో రూ.5000లోపే బెస్ట్ ఎయిర్ కూలర్లు అందుబాటులోకి వచ్చేశాయి. గతంలో హై ప్రైస్ తో ఉన్న ఈ ఎయిర్ కూలర్లు.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో బంపర్ ఆఫర్లు అందిస్తున్నాయి.

అయితే సమ్మర్ ఎఫెక్ట్ తో రానున్న రోజుల్లో కూలర్లకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉండడంతో.. ధరలు పెరగడమే కాదు, స్టాక్ కూడా తక్కువ అవుతుంది. దాంతో ఇప్పుడే భారీ తగ్గింపులతో పాటు EMI ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉండడంతో కొనెయ్యడం బెటర్ అని అంటున్నారు.

best-coolers-under-5000-rupees-in-flipkart

5వేల లోపు బెస్ట్ ఆఫర్లు ఉన్న ఎయిర్ కూలర్స్ ఇవే...

క్యాండెస్ 25 లీటర్ ఎయిర్ కూలర్..

క్యాండెస్ బ్రాండ్ 25 లీటర్ సామర్థ్యం గల ఈ ఎయిర్ కూలర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. స్టైలిష్ డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్ కూలింగ్ ఇచ్చే ఈ కూలర్ అసలు ధర ₹11,399 కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ₹3,879కి లభ్యమవుతోంది. నెలకు ₹137 EMI ఆప్షన్‌తో తీసుకోవచ్చు. తక్కువ కరెంట్ ఖర్చుతో ఎక్కువ చల్లదనం ఇవ్వగలిగే ఈ కూలర్ చిన్న కుటుంబాలకే కాదు, హోస్ట్‌ల్‌లో ఉండేవాళ్లకి కూడా చక్కటి ఎంపిక అవుతుంది.

థామ్సన్ 28 లీటర్ పర్సనల్ కూలర్..

స్టైలిష్ లుక్ కావాలా, ఇంకా మంచి పనితీరు కూడా కావాలా అంటే థామ్సన్ 28 లీటర్ కూలర్ మీ కోసం. సోబర్ వైట్ కలర్‌తో అదిరే లుక్ ఇస్తుంది. మోటారు బలంగా ఉండడంతో గదులకే కాదు, మధ్యస్థ పరిమాణం ఉన్న హాల్స్‌కి కూడా మంచి కూలింగ్ ఇస్తుంది. దీని అసలు ధర ₹5,999 కాగా, ప్రస్తుతం ₹4,499కే లభిస్తోంది. నెలకు సుమారు ₹1500 EMI కూడా తీసుకోవచ్చు. డిజైన్, డ్యూరబిలిటీ రెండూ కావాలనుకునే వాళ్లకి ఇది పర్ఫెక్ట్ మ్యాచింగ్ కూలర్.

బజాజ్ 24 లీటర్ పర్సనల్ కూలర్..

ఇండియన్ మార్కెట్‌లో బజాజ్ బ్రాండ్ అంటే నమ్మకమే. వారి 24 లీటర్ సామర్థ్యం గల కూలర్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ₹5,299కి లభ్యమవుతోంది (అసలు ధర ₹7,360). తక్కువ విద్యుత్తుతో ఎక్కువ పనితీరు ఇవ్వగల ఈ మోడల్ ఎనర్జీ ఎఫిషియెంట్ మోటార్‌తో వస్తుంది. బిల్ట్ క్వాలిటీ బాగుండి, కూలింగ్ పవర్ కూడా మామూలుగా ఉండదు. నెలకు ₹1,767 EMI ద్వారా కూడా కొనవచ్చు. మంచి బ్రాండ్, హై క్వాలిటీ కోసం చూస్తున్నవాళ్లకి ఇది సేఫ్ ఆప్షన్.

కెన్‌స్టార్ టవర్ కూలర్..

కెన్‌స్టార్ టవర్ కూలర్ తక్కువ స్థలంలో ఇమిడిపోతుంది. శబ్దం తక్కువగా ఉండే ఈ కూలర్ వెంటనే చల్లదనం ఇస్తుంది. అసలు ధర ₹7,990 అయినప్పటికీ, ఇప్పుడు రూ.4,500కి దొరుకుతుంది. EMI రూ. 162 నుంచి మొదలవుతుంది. చిన్నదైనా పనికొచ్చే పవర్‌ఫుల్ కూలర్ కోసం చూస్తున్నవాళ్లకు ఇది బెస్ట్ బడ్జెట్ చాయిస్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+