గేమింగ్ లవర్స్ కోసం బెస్ట్ ఆఫర్.. HONOR GT Pro మామూలుగా లేదుగా !
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రోజుకో కొత్త ఫోన్ మార్కెట్ లోకి వచ్చేస్తోంది. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు కస్టమర్లను ఆకర్షించేందుకు దిగ్గజ కంపెనీలు సైతం పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ బ్రాండ్ హానర్ సైతం కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లను రిలీజ్ చేస్తోంది. మీడియం రేంజ్, ఫ్లాగ్ షిప్ తరహాలో మొబైల్స్ రిలీజ్ చేస్తున్న హానర్.. ఈసారి గేమింగ్ లవర్స్ కోసం కొత్త ఫోన్ ని తీసుకొచ్చింది.
HONOR GT Pro పేరుతో పవర్‌ఫుల్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఆ స్పెసిఫికేషన్లు ఏంటో ఓ లుక్కేద్దాం..

HONOR GT Pro ఫీచర్స్...
డిస్ ప్లే & డిజైన్..
HONOR GT Pro ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4320Hz PWM డిమ్మింగ్, HDR10+ సపోర్ట్ తో వస్తుంది. అంతే కాకుండా ఈ డిస్‌ప్లేకు జర్మన్ Rhine TUV గ్లోబల్ ఐ ప్రొటెక్షన్ 4.0 సర్టిఫికేషన్ కూడా ఉంది. దీంతో కళ్లకు హాని లేకుండా పనితీరు అందిస్తుందని అంటున్నారు.
ప్రాసెసర్..
ఈ ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Leading Edition (4.47GHz క్లాక్ స్పీడ్) ప్రాసెసర్ ఉంది.
స్టోరేజ్..
ఇది 12GB/16GB LPDDR5X RAM తో పాటు 256GB, 512GB, 1TB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది.
కెమెరా..
బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ లెన్స్.. 200MP టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్, 50x డిజిటల్ జూమ్) తో వస్తుంది. అలానే ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా - ఇది 4K 60fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ..
7200mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో పాటు 90W వైర్డ్ సూపర్ చార్జ్ సపోర్ట్ అందిస్తున్నారు.
అదనపు ఫీచర్లు..
అంతే కాకుండా IP68/IP69 రేటింగ్ తో - నీరు, ధూళిని తట్టుకునేలా డిజైన్ చేశారు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధరలు..
(చైనా యువాన్ ప్రకారం):
12GB + 256GB - ¥3699 (సుమారు ₹43,250)
12GB + 512GB - ¥3999 (సుమారు ₹46,755)
16GB + 512GB - ¥4299 (సుమారు ₹50,265)
16GB + 1TB - ¥4799 (సుమారు ₹56,110)
రంగులు..
HONOR GT Pro ఐస్ క్రిస్టల్ వైట్, ఫాంటమ్ బ్లాక్, బర్నింగ్ స్పీడ్ గోల్డ్ వంటి మూడు ఆకర్షణీయ రంగుల్లో లభిస్తుంది. అయితే ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుందోనని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గేమింగ్ లవర్స్ కు ఈ ఫోన్ ఖచ్చితంగా నచ్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications