Breast Milk Ice Cream: లేటేస్ట్ ట్రెండ్: ఎగబడి కొంటున్నారు..!!
బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్.. కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. దీన్ని ఎగబడి కొంటున్నారు జనం. ఇప్పటివరకు తిన్న ఐస్ క్రీమ్ లల్లో లేని టేస్ట్ ఇందులో ఉందట. దాదాపుగా అన్ని ఫ్లేవర్లలోనూ ఇది అందుబాటులో ఉంది. ఈ ఐస్ క్రీమ్ అమ్మకానికి ఉంచిన అన్ని అవుట్ లెట్ల ముందు జనం బారులు తీరి నిల్చుంటోన్నారు.
అమెరికా మార్కెట్ లో సెంటార్ ఆఫ్ అట్రాక్షన్ అయిందీ ఐస్ క్రీమ్. బ్రూక్లిన్ లోని ఆడ్ ఫెలోస్, టాయ్ మేకింగ్ కంపెనీ ఫ్రిడా జాయింట్ గా ఈ వినూత్న ప్రయోగానికి తెర తీశాయి. బ్రెస్ట్ మిల్క్ ఐస్‌క్రీమ్‌ను విడుదల చేశాయి. ఫ్రిడా అనేది ఈ ఐస్ క్రీమ్ బ్రాండ్ నేమ్. బ్రూక్లిన్, మన్ హట్టన్, న్యూయార్క్‌లో గల ఆడ్ ఫెలోస్ అవుట్‌లెట్లల్లో ఇది అందుబాటులో ఉంటోంది. ప్రతిరోజూ 50 స్కూప్స్ మాత్రమే అమ్ముతారు.

నిజానికి- ఇది పేరుకు మాత్రమే బ్రెస్ట్ మిల్క్ ఐస్ క్రీమ్. దీని తయారీలో బ్రెస్ట్ మిల్క్ ను ఉపయోగించట్లేదు. అందులో ఉండే- లిపోసోమల్ బోవైన్ కొలొస్ట్రమ్ వంటి ఇతర పోషకాలను ఈ ఐస్ క్రీమ్ తయారీలో వాడుతున్నట్లు ఆడ్ ఫెలోస్ సంస్థ వెల్లడించింది. ఈ లిపోసోమల్ బోవైన అనేది సాధారణంగా తల్లిపాలలో కనిపించే సప్లిమెంట్.
ఐస్ క్రీమ్ తయారీకి హెవీ క్రీమ్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, షుగర్, డెక్స్‌ట్రాస్, గుడ్డు సొన, ఇన్వర్ట్ షుగర్, గువా గమ్, సాల్టెడ్ కారామెల్ ఫ్లేవరింగ్, తేనె సిరప్, లిపోసోమల్ బొవైన్ కొలొస్ట్రమ్ ను వినియోగిస్తోన్నారు. 0.1 శాతం ప్రొపైల్ పారాబెన్ ఇందులో మిళితం చేస్తోన్నారు. ఇది ప్రిజర్వేటివ్ కోసం ఉపయోగపడుతుంది.
ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుందని అమెరికన్లు చెబుతున్నారు.. అమెరికన్లు. కొంచెం తీపి, కొంచెం ఉప్పు కలిసిన టేస్ట్ వస్తోందని, తల్లిపాల రుచిని గుర్తు చేస్తోందని, హనీ సిరప్ వాడటం వల్ల తేనె రుచి కొంత డామినేట్ చేస్తోందని అంటున్నారు. బొవైన్ కొలొస్ట్రమ్ వాడటం వల్ల ఐస్ క్రీమ్ కొంత పసుపు రంగులో ఉంటోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications