హీరో స్ప్లెండర్ కంటే చవక! తక్కువ ధరలో సూపర్ మైలేజ్ బైకులివే!!
సాధారణంగా చౌకైన, మంచి మైలేజ్ ఇచ్చే బైక్ గురించి మాట్లాడినప్పుడు చాలా మందికి ముందుగా హీరో స్ప్లెండర్ బైక్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం హీరో స్ప్లెండర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.73,902 నుంచి ప్రారంభమవుతుంది. హీరో స్ప్లెండర్ అద్భుతమైన బైక్ అయినప్పటికీ.. ఇది దేశంలో అత్యంత చౌకైన బైక్ కాదు. మీరు హీరో స్ప్లెండర్ కంటే తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నట్లయితే.. ఇది మీ కోసమే. టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్ 100, హీరో హెచ్ఎఫ్ 100 వంటి మోడల్స్ హీరో స్ప్లెండర్ కంటే తక్కువ ధరకు లభిస్తున్నాయి. వాటి వివరాలు, ధరలు, మైలేజ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
హీరో స్ప్లెండర్ కంటే చౌకైన టాప్-4 బైకులు ఇవే..
1. టీవీఎస్ స్పోర్ట్(TVS Sport)
ఈ జాబితాలో మొదటి స్థానంలో టీవీఎస్ స్పోర్ట్ బైక్ ఉంది. ఇది దేశంలోనే అత్యంత చౌకైన, మంచి మోటార్‌సైకిళ్లలో ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 55,100 నుంచి ప్రారంభమవుతుంది, ఇది హీరో స్ప్లెండర్ కంటే చాలా తక్కువ. ఇది లీటర్ పెట్రోలుకు 70 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడంతో పాటు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో నడుస్తుంది. ఈ బైక్ 109.7 cc ఇంజిన్, 8.19 PS పవర్, 8.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2. బజాజ్ ప్లాటినా 100(Bajaj Platina 100)
చౌకైన బైక్‌ల జాబితాలో బజాజ్ ప్లాటినా 100 రెండో స్థానంలో ఉంది. ఇది హీరో స్ప్లెండర్ కంటే కూడా తక్కువ ధరకే లభిస్తుంది. ఇది కేవలం ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 65,407. ఈ బైక్ 70కి పైగానే మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ 102 cc ఇంజిన్, 7.9 PS పవర్, 8.3 Nm టార్క్ అందిస్తుంది.
3. హోండా షైన్ 100 ( Honda Shine 100)
హోండా షైన్ 100 కూడా దేశంలో చౌకగా లభించే మోటార్‌సైకిళ్లలో ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 63,191.ఈ బైక్ 55 kmpl మైలేజీని అందిస్తుంది.ఈ బైక్ 98.98 cc ఇంజిన్, 7.38 PS పవర్, 8.05 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
4. హీరో హెచ్‌ఎఫ్ 100 (Hero HF 100)
తక్కువ ధరలో మంచి బైక్ కొనాలనుకునే వారికి హీరో హెచ్‌ఎఫ్ 100 ఒక అద్భుతమైన ఎంపిక. దీని లుక్, పనితీరు బాగుంటాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 58,739. ఇది లీటరు పెట్రోల్‌కు 70 kmpl మైలేజీని అందిస్తుంది.ఈ బైక్ 97.2 cc ఇంజిన్, 8.02 PS పవర్, 8.05 Nm టార్క్ అందిస్తుంది.
ఈ బైక్‌లు అన్నీ హీరో స్ప్లెండర్ కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండి, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులను అందిస్తాయి. మీ బడ్జెట్, అవసరాలకు సరిపోయే బైక్‌ను మీరు వీటిలో ఎంచుకోవచ్చు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications