శాటిలైట్స్ టార్గెట్‌గా కొత్త ఆయుధం.. అంతరిక్ష యుద్ధానికి సిద్ధమవుతున్న డ్రాగన్!
అంతరిక్ష రంగంలో ఆధిపత్యం కోసం చైనా మరో సంచలన ఆయుధాన్ని సిద్ధం చేసింది. ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ వంటి ఉపగ్రహ నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా చైనా శాస్త్రవేత్తలు ఓ శక్తివంతమైన మైక్రోవేవ్ ఆయుధాన్ని అభివృద్ధి చేశారు.
స్టార్‌లింక్ కిల్లర్: TPG1000Cs
చైనాలోని నార్త్ వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ పరిశోధకులు వాంగ్ గాంగ్ నేతృత్వంలో ఈ పరికరాన్ని రూపొందించారు. దీనికి TPG1000Cs అని పేరు పెట్టారు. ఇది ఒక గిగావాట్ (1 GW) కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలదు. భూమికి అతి తక్కువ ఎత్తులో తిరిగే స్టార్‌లింక్ ఉపగ్రహాలను ఇది తీవ్రంగా దెబ్బతీయగలదు లేదా వాటి పనితీరును పూర్తిగా నిలిపివేయగలదు.

ఈ ఆయుధం ప్రత్యేకతలు
ఇది ఏకధాటిగా ఒక నిమిషం పాటు 20 గిగావాట్ల విద్యుత్ శక్తిని విడుదల చేయగలదు. ఈ పరికరం కేవలం 4 మీటర్ల పొడవు ఉండి, సుమారు 5 టన్నుల బరువు ఉంటుంది. దీనిని ట్రక్కులు, నౌకలు లేదా విమానాలపై కూడా అమర్చవచ్చు. సాధారణంగా ఇలాంటి మైక్రోవేవ్ ఆయుధాలు కొన్ని సెకన్లకే వేడెక్కుతాయి. కానీ చైనా తయారు చేసిన ఈ కొత్త సిస్టమ్ 3,000 హై-ఎనర్జీ పల్స్‌లను వరుసగా విడుదల చేయగలదు. ఇప్పటికే 2 లక్షల సార్లు దీనిని విజయవంతంగా పరీక్షించారు.
చైనా భయం ఏమిటంటే?
అమెరికాకు చెందిన స్టార్‌లింక్ ఉపగ్రహాలు తమ జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని చైనా భావిస్తోంది. యుద్ధ సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ ఉపగ్రహ నెట్‌వర్క్ అమెరికా సైన్యానికి సహకరిస్తుందని చైనా రక్షణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే వాటిని అడ్డుకోవడానికి ఈ "స్టార్‌లింక్ కిల్లర్"ను రూపొందించారు.
యుద్ధ తంత్రంలో మార్పు
సాధారణ క్షిపణులు లేదా బాంబుల కంటే ఈ మైక్రోవేవ్ ఆయుధాలు చాలా చౌకైనవి. ఇవి శత్రు వాహనాలు లేదా ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లను శక్తివంతమైన మైక్రోవేవ్ కిరణాలతో కాల్చేస్తాయి. దీనివల్ల శత్రువుకు ఏం జరిగిందో తెలిసే లోపే వారి కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలుతుంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications