Usain Bolt రికార్డ్ బద్దలైంది. తుఫాన్ వేగంతో రోబో పరుగు: Video

ట్రాక్ అండ్ ఫీల్డ్ చరిత్రలోనే తిరుగులేని వేగానికి చిరునామాగా నిలిచిన అథ్లెటిక్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డును ఒక యంత్రం తుడిచిపెట్టేసింది! బేజింగ్‌లో శనివారం ఘనంగా ప్రారంభమైన 'వరల్డ్ హ్యూమనోయిడ్ రోబో గేమ్స్' రెండవ ఎడిషన్‌లో మానవ మాత్రులకు సాధ్యం కాని వేగాన్ని రోబోలు ప్రదర్శించి అందరినీ మైమరిపించాయి.

రోబో సినిమాలో మనం చూసినట్లు.. జెట్ స్పీడ్ తో రోబో పరుగులు పెట్టింది. బేజింగ్ హ్యూమనోయిడ్ రోబో ఇన్నోవేషన్ సెంటర్ తయారు చేసిన 'టియాంగాంగ్ ఆల్ట్రా' అనే రోబో 100 మీటర్ల పరుగును కేవలం 9.39 సెకన్లలోనే పూర్తి చేసి ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. 2009 బెర్లిన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బోల్ట్ నమో చేసిన 9.58 సెకన్ల వరల్డ్ రికార్డును ఇది దాటేసింది.

Chinese Humanoid Robot Outruns Usain Bolt Tiangong Ultra Clocked 9 39 Seconds in Beijing 100m Race

రేసు ప్రారంభంలో కాస్త వెనుకబడినప్పటికీ, ముగింపు రేఖకు చేరువయ్యే క్రమంలో 'టియాంగాంగ్ ఆల్ట్రా' అద్భుతమైన వేగాన్ని అందుకొని అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ రూపొందించిన 'లైట్నింగ్' అనే రోబో 9.47 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఇది కూడా ఉసేన్ బోల్ట్ రికార్డు కంటే వేగంగా ఉండటం గమనార్హం.

అయితే రేసు పూర్తయ్యాక ఈ రోబోల ప్రవర్తన ప్రేక్షకులను భయాందోళనకు గురిచేసింది. వేగాన్ని అదుపు చేసుకోలేక రోబోలు రక్షణ కోసం ఏర్పాటు చేసిన మందపాటి మ్యాట్‌ను బలంగా ఢీకొట్టాయి. టియాంగాంగ్ పక్కకు దూసుకెళ్లడంతో ప్రేక్షకులు భయంతో పక్కకు తప్పుకోగా, లైట్నింగ్ కిందపడిపోవడంతో నిర్వాహకులు దానిని స్ట్రెచ్చర్‌పై మోసుకెళ్లాల్సి వచ్చింది.

ఏడాదిలోనే సంచలన పురోగతి: సగం తగ్గిన సమయం

గతేడాది జరిగిన తొలి గేమ్‌లలో ఇదే టియాంగాంగ్ ఆల్ట్రా 100 మీటర్ల రేసును పూర్తి చేయడానికి 21.50 సెకన్ల సమయం తీసుకుంది. కానీ ఈసారి సాంకేతికతను భారీగా అప్‌గ్రేడ్ చేయడంతో సగానికి పైగా సమయాన్ని తగ్గించుకుని రికార్డు సృష్టించింది. గతంలో నిర్వహించిన హ్యూమనోయిడ్ హాఫ్ మారథాన్‌ను కూడా ఇది గెలుచుకుంది. మరోవైపు హానర్ 'లైట్నింగ్' రోబో కూడా ప్రాక్టీస్ రేసులో 9.32 సెకన్ల టైమింగ్ నమోదు చేసి, గరిష్టంగా సెకనుకు 14.5 మీటర్ల వేగాన్ని అందుకుంది. ఈ పోటీల కోసం లైట్నింగ్ కాళ్ల పొడవును ప్రత్యేకంగా 10 సెంటీమీటర్లు పెంచడం విశేషం.

చైనా వ్యూహాత్మక అడుగులు: ప్రపంచ స్థాయి పోటీగా రోబో గేమ్స్

రోబోటిక్స్ రంగాన్ని తమ వ్యూహాత్మక పరిశ్రమగా మలుచుకుంటున్న చైనా.. ఏఐ సాయంతో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ విజయం పరిశ్రమపై భారీ ప్రభావం చూపుతోంది. ఈ పోటీల్లో కేవలం పరుగు పందెం మాత్రమే కాకుండా ఫుట్‌బాల్, డ్యాన్స్, పరిశ్రమల్లో పనిచేసే నైపుణ్యాలతో సహా మొత్తం 51 రకాల ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. బేజింగ్ నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఓవల్‌లో బుధవారం వరకు జరిగే ఈ క్రీడల్లో 16 దేశాల నుంచి 666 టీమ్‌లు, ఏకంగా 2,056 రోబోలు పాల్గొంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+