గమ్యం లేని వింత తోకచుక్క- గమనం చూసి ఉలిక్కిపడుతున్న నాసా
మన సౌర వ్యవస్థలోకి ప్రవేశించిన ఓ తోకచుక్క నాసా దృష్టిని ఆకర్షించింది. దాని గమ్యం, గమనం ఉలిక్కి పడేలా చేస్తోంది. అంతరిక్ష పరిశోధకులకు సవాల్ విసురుతోంది. దాని కదలికలు ఆశ్చర్యానికి గురి చేస్తోన్నాయి. ఎటు తిరిగి ఎటు వస్తుందో.. అనే ఆందోళన వారిలో నెలకొంది. దీని ప్రభావం భూమిపై ఉండకపోవచ్చనడానికి గ్యారంటీ ఇవ్వట్లేదు. ఇదొక ఇంటర్ స్టెల్లార్ తోకచుక్క. ఈ ఏడాది జనవరిలో దీన్ని గుర్తించారు.
ఏప్రిల్ 4, 5 తేదీల్లో..
దీనిపేరు C/2026 A1 (MAPS). త్వరలో ఇది భూమి మీదుగా దూసుకెళ్లబోతోంది. ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఇది మన గ్రహాన్ని దాటుకుని వెళ్తుందని నాసా వెల్లడించింది. ఆ సమయంలో ఈ తోకచుక్కను స్పష్టంగా చూడవచ్చు. భూమి మీదుగా సూర్యడి వైపు దూసుకెళ్తున్నప్పుడు అది శుక్రగ్రహం కంటే ప్రకాశవంతంగా కనిపించే అవకాశం ఉంది. ఫలితంగా స్పేస్ బైనాక్యులర్ సహాయంతో దీని గమనాన్ని తిలకించవచ్చు.

దక్షిణార్ధగోళంలో..
సూర్యుడికి అత్యంత సమీపానికి వచ్చినప్పుడు దక్షిణార్ధగోళంలో దేశాల ప్రజలు దీన్ని చూడవచ్చు. సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ ఆకాశంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ లో కూడా ఆ అవకాశం ఉంది. దక్షిణం- నైరుతి దిశలో సంధ్యా కాంతిలో మిళమిళమని మెరుస్తూంటుందీ తోకచుక్క. ఉత్తరార్ధగోళంలో ఇది కనిపించడం దాదాపుగా అసాధ్యం. క్షితిజరేఖకు తక్కువగా ఉండటం వల్ల ఉత్తరార్థగోళం వారికి కనిపించదు.
అత్యంత ప్రకాశవంతంగా..
క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో సూర్యుడికి సమీపంగా వెళ్ళిన 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెడల్పున్న ఒక భారీ కేంద్రకం పలు ముక్కలుగా విడిపోవడంతో ఈ తోకచుక్కలు ఏర్పడ్డాయి. ముందుగా రెండు పెద్ద భాగాలుగా, ఆపై అనేక చిన్న శకలాలుగా విడిపోయాయి. 1882 నాటి ఓ తోకచుక్క దక్షిణ ఆకాశంలో అసాధారణంగా ప్రకాశవంతంగా కనిపించింది. అత్యంత ప్రకాశవంతంగా ఉన్నప్పుడు పౌర్ణమి చంద్రుడిని కూడా మించిపోయిందని, దాని తేజస్సు రోజుల తరబడి కొనసాగిందని పరిశీలకులు వివరించారు.
ఇప్పుడు ఇది కూడా..
ఇప్పుడు ఇది అదే స్థాయిలో కనిపించే అవకాశాలను సైంటిస్టులు కొట్టిపారేయట్లేదు. చిలీలో పనిచేస్తున్న ఫ్రెంచ్ ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు 'MAPS' (మౌరీ, అట్టార్డ్, ప్యారోట్, సిగ్నోరేట్) అనే కార్యక్రమం ద్వారా జనవరి 13వ తేదీన ఈ తోకచుక్కను గుర్తించారు. ఇది సాధారణ సన్‌గ్రేజర్ల కంటే చాలా దూరంలో ఉన్నప్పుడు సైంటిస్టుల కంటికి చిక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పరిమాణంలో అతి భారీగా ఉండటమే దీనికి కారణమని అంచనా వేశారు.
సూర్యుడికి అత్యంత సమీపానికి..
సాధారణంగా 'క్రెయుట్జ్ సన్‌గ్రేజింగ్' తోకచుక్కల గమనం గానీ, వాటి పరిభ్రమణం గానీ ఎక్కువగా సూర్యుడి చుట్టే ఉంటాయి. ఈ తోకచుక్కలు సూర్యుడికి అత్యంత సమీపానికి, దాని ఉపరితలం మీదుగా దూసుకుపోతుంటాయి. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త హెన్రిక్ క్రెయుట్జ్ వాటి కక్ష్యలను అధ్యయనం చేసినందున ఈ తోకచుక్కల కుటుంబానికి ఆయన పేరు పెట్టారు. ఇవి సాధారణ తోకచుక్కల కంటే భిన్నం. సూర్యుడికి అత్యంత సమీపం నుండి పరిభ్రమిస్తుంటాయి ఇవి. సీ/2026 మ్యాప్స్ తోకచుక్క పూర్తిగా మంచుతో కూడుకుని, ఘనీభవించి ఉంటుంది.
మంచు మొత్తం కూడా ..
అది సూర్యుడిని సమీపించినప్పుడు అధిక వేడి వల్ల ఆ మంచు మొత్తం కూడా ద్రవీభవిస్తుంది. ఆవిరిగా మారుతుంది. సూర్యకిరణాలు వాటి మీద అత్యంత ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. ఆ సమయంలో ఆ తోకచుక్క.. అతి భారీ పరిమాణంలో గ్యాస్, ధూళి ప్రవాహాలు వెదజల్లుతుంది. ఆ మెరుపు కారణంగా అవి అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు పగటిపూట కూడా వాటిని చూసే వెసలుబాటు ఉంటుంది. గ్రహాల కంటే ప్రకాశవంతంగా మెరుస్తాయి.
సూర్యుడి నుండి వెలువడే బలమైన కిరణాలు..
ఇదే వేడి వాటికి పెనుముప్పుగా మారుతుంది. సూర్యుడి నుండి వెలువడే బలమైన కిరణాలు ఈ తోకచుక్కలను విచ్ఛిన్నం చేయగలవు. కక్ష్య గమనాన్ని పూర్తిగా పరిభ్రమించకముందే అనేక సన్‌గ్రేజర్లు నాశనమవుతాయి. ప్రస్తుతం C/2026 A1 (MAPS) కూడా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. సూర్యుడి వేడిని అది ఎంత వరకు తట్టుకోగలుగుతుంది, మనుగడ సాగిస్తుందనేది దాని పరిమాణం, అంతర్గత నిర్మాణ స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రకాశవంతంగా కనిపించవచ్చా లేదా పూర్తిగా అదృశ్యమవుతుందా అనేది వేచి చూడాలి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications