గ్రహాంతరజీవుల మర్మం బట్టబయలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనానికి తెర తీశారు. గ్రహాంతరవాసులక సంబంధించిన అన్ని సమగ్ర వివరాలను కూడా బయటపెట్టబోతోన్నారు. అన్ ఐడెంటిపైడ్ ఆబ్జెక్స్ట్, అన్ ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా మొదలుకుని ఏలియన్లతో ముడిపడి ఉన్న రహస్య సమాచారం మొత్తాన్నీ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి కిందటే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గ్రహాంతరవాసులు, యూఎఫ్ఓలు, ఇతర గ్రహాల్లో జీవించడానికి గల అవకాశాలపై ఇప్పటివరకు సాగించిన వివరాల ఫైళ్లను బయటపెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోసల్ లో దీనికి సంబందించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్. గుర్తుతెలియని ఎగిరే వస్తువులు, గ్రహాంతరవాసులు, ఇతర గ్రహాల జీవానికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేయాలని తన అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఫైళ్లు ఎన్ని ఉన్నాయో.. వాటన్నింటినీ గుర్తించాలని, విడుదల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్, అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఇతర ఏజెన్సీల అధిపతులను ఆదేశించానని అన్నారు.

ఈ పరిశోధనలన్నీ కూడా అత్యంత సంక్లిష్టమైనవి, ఆసక్తికరమైనవని డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. వీటి గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన ఈ విషయాలకు సంబంధించిన అన్ని ఇతర సమాచారాన్ని కూడా విడుదల చేయాలని ఆదేశించినట్లు వివరించారు. దశాబ్దాలుగా ప్రజల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తూ అనేక వింత సిద్ధాంతాలు, ఊహాగానాలకు దారితీసిన ఈ అంశం ఇది. ఇన్నేళ్ల పాటు దీనిపై అమెరికా సాగించిన పరిశోధనలు ఇక వెలుగులోకి రానున్నాయి.
యూఎఫ్‌ఓలకు సంబంధించిన ఏ ఫైల్ అయినా ఇక అది దాపరికం కాదు. అవన్నీ కూడా విడుదల కావచ్చు. అమెరికా గగనతలంపై యూఎఫ్ఓలు సంచరించాయనే వార్తలు ఇప్పటివరకు చాలానే వచ్చాయి. ఓ గ్రహాంతరవాసిని అమెరికా సైంటిస్టులు నిర్బంధంలోకి తీసుకున్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూఎఫ్ఓలపై పరిశోధనలు సాగించినట్లు గతంలో నాసా కూడా సూచనప్రాయంగా వెల్లడించింది కూడా.
వాటిలో ఎలాంటి సమాచారం ఉంటుందనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టతా లేదు. అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ గురించి ట్రాక్ చేస్తూ వస్తోంది పెంటగాన్.. దశాబ్దాలుగా. అన్ ఐడెంటిపైడ్ ఆబ్జెక్స్ట్, అన్ ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినాపై సాగిస్తోన్న పరిశోధనలు ఏవీ కూడా గ్రహాంతరవాసుల ఉనికిని ధృవీకరించలేదని 2024లో విడుదల చేసిన నివేదనలో స్పష్టం చేసింది పెంటగాన్. ఇప్పుడు- ట్రంప్ ఇచ్చిన తాజా ఆదేశాలతో అవన్నీ కూడా వెలుగులోకి రాబోతోన్నాయి.
-
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
అమెరికాలో ‘తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్ -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్












Click it and Unblock the Notifications