భూమి బద్ధలయ్యే ముప్పు.. 190 అడుగుల పొడవు.. గంటకు 41 వేల కిలోమీటర్ల వేగంతో..

భూ గ్రహం వైపు ఓ భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. 190 అడుగుల ఎత్తున్న ఈ భారీ గ్రహశకలం గంటకు 41 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపునకు దూసుకొస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు అలర్ట్ అయ్యారు. గ్రహశకలం వేగం, గమ్యాన్ని నాసా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోంది. ఈ గ్రహశకలానికి 2025 పీఎమ్ 2 అని నామకరణం చేశారు సైంటిస్టులు. ఈ గ్రహశకలం ఆగస్టు 27 నాటికి భూ గ్రహానికి 2.31 మిలియన్ మైల్స్ దూరం నుంచి దూసుకెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. అయితే ఆకాశంలో ఎలాంటి విపత్తు అయినా జరిగే అవకాశం ఉంది కాబట్టి పీఎమ్ 2 గ్రహ శకలం కదలికల్ని నాసా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సమాచారం ప్రపంచవ్యాప్తంగా ఖగోళ సంస్థలు, అంతరిక్ష పరిశోధనా కేంద్రాలకు అందజేస్తుంది.

అనంత విశ్వంలో సాధారణంగా అనేక పరిణామాలు, సంఘటనలు, ఆశ్చర్యాలు జరుగుతుంటాయి. అయితే వాటన్నింటిని శాస్త్రవేత్తలు పెద్దగా పట్టించుకోరు. కేవలం వాటికి భూమితో ఏమైనా ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడు మాత్రమే వాటిపై శ్రద్ధ చూపిస్తారు. అయితే తాజాగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. ఏం జరగబోతుందనే భయంతో విశ్వాన్ని నిరంతరం గమనిస్తూ ఉన్నారు. దీనికి కారణం.. 2025 పీఎమ్ 2 గ్రహశకలం. ఇది ప్రస్తుతం భూమి వైపు దూసుకొస్తోంది.

2025 పీఎమ్ 2 గ్రహశకలం 190 అడుగుల(58 మీటర్లు) ఎత్తు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ భారీ గ్రహశకలం గంటకు 41, 390 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నట్లు తేల్చారు. ఆగస్టు 27 నాటికి ఈ ఆస్టరాయిడ్ భూమిని దాటి వేస్తుందని అంచనా వేస్తున్నారు. భూ గ్రహానికి 2.31 మిలియన్ మైల్స్ దూరం నుంచి దూసుకెళ్లే అవకాశం ఉందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి గ్రహ శకలాలను ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేయడం ఎంతో అవసరం అని నాసా స్పష్టం చేస్తోంది.

Earth at Risk 190-Foot Asteroid Racing at 41 000 km h Could Strike

అయితే ఇలాంటి గ్రహశకలాలు భూమి వైపు దూసుకొస్తున్న క్రమంలో గురుత్వాకర్షణ శక్తి ద్వారా లేదా ఇతర ఆస్టరాయిడ్స్ తో ఢీ కొట్టడం ద్వారా అవి తమ గమనాన్ని మార్చుకుని భూమి లోపలి భాగంలో పడే ప్రమాదం ఉన్నట్లు నాసా సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ఆస్టరాయిడ్ కారణంగా భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ పెద్ద పెద్ద గ్రహశకలాలను స్టడీ చేయడం ఎంతైనా అవసరం ఉందని తెలిపారు. ఆస్టరాయిడ్స్ పై అధ్యయనం చేసేందుకు తాము నాసా, ఈఎస్ఏ, జాక్సా లాంటి అంతరిక్ష సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+