Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈసారి కూడా తగ్గేదే లే.. లక్ష కోట్లతో రికార్డ్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..?

e-commerce Sales: గత వారంతో ముగిసిన ఫెస్టివల్ సీజన్ సేల్ లో ఈ కామర్స్ దిగ్గాజాలు భారీగా లాభాలను ఆర్జించాయి. దీంతో గత ఏడాది ఇదే కలం లాభాలను కొనసాగిస్తూ సుమారు లక్షల కోట్లతో రికార్డ్ సేల్స్ నెలకొల్పిందని ఇండస్ట్రీ డేటా వెల్లడించింది. దీనికి నాన్ మెట్రో నగరాలలోని కస్టమర్ల నుండి లగ్జరీ బ్రాండ్ల కొనుగోళ్ల డిమాండ్ తోడ్పడింది. ఈ కామర్స్ కన్సల్టెన్సీ దాటాం ప్రకారం ఈ ఏడాది పండగ సీజన్ సేల్స్ 23% పెరిగిందని 2022 కంటే (69,800కోట్లు) గత ఏడాది లాభాలను కొనసాగించింది.

ఈ సేల్స్‌లో సగం గత నెల ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అలాగే అమెజాన్ నుంచి రూ.55 వేల కోట్ల గూడ్స్ సేల్స్ ద్వారా వచ్చింది. తరువాత మెల్లి మెల్లిగా మూడోవారంలో తగ్గాయి. ఈసారి కొందరు ఫ్లిప్ కార్ట్ సెల్లర్స్ 40-50 శాతం అభివృద్ధి చెందగా అమెజాన్ కి 85% నాన్ మెట్రో నుండి కస్టమర్లు వచ్చినట్లు తెలిపింది. టైర్- 2, టైర్- 3 నగరాలూ సహ స్మార్ట్ ఫోన్స్, టీవీలు ఇంకా ఇతర ఫ్యాషన్ వాటికీ డిమాండ్ పేరిగినట్లు దాటం అడ్వైజర్ సతీష్ మీనా తెలిపారు.

Ecommerce companies made whooping 1 lakh crore rupees sales in this festival season

గ్రోసరీ, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అలాగే కిచెన్ అండ్ హోమ్ ప్రొడక్ట్స్ సేల్స్ కూడా ఇందులో ఉన్నట్లు ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ అన్నారు. ఎప్పటిలాగే స్మార్ట్ ఫోన్ సేల్స్ ఈ సీజన్‌లో టాప్ లో ఉండగా ఆన్ లైన్ కొనుగోళ్లు ఈ సీజన్లో 65% ఉన్నట్లు మీనా తెలిపారు. ఏఐ ఫీచర్స్ కారణం ప్రీమియం, మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాలు అభివృద్ధి చెందాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ పోటీదారి అమెజాన్ కూడా ప్రతి ఏడాది ప్రాతిపదికన 30వేల ధర దాటినా స్మార్ట్ ఫోన్స్ సేల్స్ టైర్-2 నగరాల నుంచి ఉన్నట్లు తెలిపింది.

అయితే ఈ సీజన్లో కస్టమర్ల నుండి టాప్ లగ్జరీ బ్రాండ్స్ డిమాండ్ హైలెట్ గా నిలిచాయి. కొందరు ఎగ్జిక్యూటివ్ ల ప్రకారం ఈసారి ఫ్యాషన్ దుస్తుల కొనుగోళ్లు కూడా సేల్స్ కి బూస్ట్ ఇచ్చాయి అన్నారు. అంతేకాదు వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యూటీ, కిడ్స్ వేర్, జ్యువెలరీ సేల్స్ కూడా 400% పెరుగుదలను చుసాయి అని అమెజాన్ ఒక స్టేట్మెంట్ ద్వారా తెలిపింది. ఈసారి సేల్స్ చక్కగా ఉపందుకున్నాయని ఇంకా పెళ్లిళ్ల సీజన్ తోడవటం ఫ్యాషన్ సేల్స్ ట్రెండ్ కొనసాగించమని బ్యూటీ అండ్ ఫ్యాషన్ రిటైలర్ ఫల్గుణి నాయర్ అన్నారు. గత ఏడాది కంటే మిషో సేల్స్ ఈ ఏడాది బ్లాక్ బుస్టర్ సేల్స్ ద్వారా 40% ఉపందుకున్నట్లు తెలిపింది. ఈ ఫెస్టివల్ సేల్స్ ప్రభావం యూపీఐ పేమెంట్స్ పెరుగుదలకు కూడా సహాయపడ్డాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 34% పెరుగుదలతో 23 లక్షల ట్రాన్సక్షన్స్ జరిగాయి. ఇదే క్రమంలో క్విక్ కామర్స్ ఊహించిన దాని కంటే ఎక్కువే కనబర్చినట్లు దాటం మీనా అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+