El Nino: 2027 ఎంట్రీనే బిగ్ వార్నింగ్. వాతావరణం అస్తవ్యస్తం!

ప్రపంచాన్ని వణికిస్తున్న వాతావరణ మార్పులపై శాస్త్రవేత్తలు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఏడాది ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న 'ఎల్ నినో' ప్రభావం, అంతకంతకూ పెరుగుతున్న సముద్రాల ఉష్ణోగ్రతలు భవిష్యత్తులో భూమి వాతావరణాన్ని ఏ విధంగా శాసించనున్నాయనే దానిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రాలు, వాతావరణం ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తుండటంతో.. రాబోయే రోజుల్లో ఇది ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాలు, ఉష్ణోగ్రతలు, పర్యావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపనుందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ఎల్ నినో దూకుడు: శాస్త్రవేత్తల నిశిత పరిశీలన

పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు భూమధ్యరేఖ ప్రాంతాలలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్ని 'ఎల్ నినో' అంటారు. ఇది 'ఎన్సో' (ENSO) వాతావరణ చక్రంలో ఒక భాగం. ఎల్ నినో సమయంలో సాధారణంగా పశ్చిమ పసిఫిక్ వైపు వీచే ఉష్ణోగ్రత గాలి బలహీనపడుతుంది. దీనివల్ల వేడి నీరు తూర్పు వైపునకు విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ప్రసరణను, వర్షపాత పద్ధతులను పూర్తిగా తలకిందులు చేస్తుంది. డిసెంబర్ నాటికి ఈ ఎల్ నినో మరింత పీక్స్ కు చేరుకునే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తన అప్‌డేట్‌లో హెచ్చరించింది.

El Nino and Ocean Warming Threaten Global Climate How Extreme Weather Could Shape Temperatures by 2027

అడుగడుగునా ఉడికిపోతున్న సముద్రాలు.. అసలు ముప్పు ఇక్కడే!

శిలాజ ఇంధనాల దహనం, అడవుల నరికివేత వల్ల విడుదలవుతున్న గ్రీన్‌హౌస్ ఉద్గారాలు భూవాతావరణంలో వేడిని బంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూమిపై పేరుకుపోతున్న అదనపు వేడిలో ఎక్కువ భాగాన్ని మహాసముద్రాలే పీల్చుకుంటున్నాయి. ఫలితంగా సముద్రాలు రికార్డు స్థాయిలో వేడెక్కుతున్నాయి. దీనికి తోడు ఎల్ నినో ప్రభావం తోడవడంతో సముద్ర జలాలు మరింత ఉడికిపోతున్నాయి. ఈ వేడి కారణంగా విపరీతమైన తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడటం, సముద్ర మట్టాలు పెరగడం, సముద్ర జీవరాశులు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపగ్రహాలు, ఏఐతో సముద్ర ప్రవాహాల గుర్తింపు

మహాసముద్రాల లోపల వేడి ఎలా కలుగుతుందనే విషయాన్ని పరిశోధించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఉపగ్రహ చిత్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో 'జియోస్టేషనరీ ఓషన్ ఫ్లో' (GOFLOW) అనే నూతన టెక్నిక్‌ను అభివృద్ధి చేశారు. దీని ద్వారా చిన్న స్థాయి సముద్ర ప్రవాహాలను అత్యంత స్పష్టంగా అంచనా వేయవచ్చు. ఈ ప్రవాహాలు గంటల వ్యవధిలో మారుతూ, సముద్ర ఉపరితలం నుంచి లోపలికి వేడి, పోషకాలు, కార్బన్ మార్పిడి జరగడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ సరికొత్త పరిశీలనల ద్వారా వాతావరణ నమూనాల్లోని అనిశ్చితిని తగ్గించడానికి శాస్త్రవేత్తలకు అవకాశం దొరుకుతుంది.

బిగ్ అలర్ట్: ఎల్ నినో డేంజర్ బెల్స్.. శీతాకాలంపై బిగ్ వార్నింగ్!
బిగ్ అలర్ట్: ఎల్ నినో డేంజర్ బెల్స్.. శీతాకాలంపై బిగ్ వార్నింగ్!

భారత్‌పై దీని ప్రభావం ఎలా ఉండనుంది?

పసిఫిక్, హిందూ మహాసముద్రాల మధ్య జరిగే పరస్పర చర్యల వల్ల భారత్‌లో వర్షపాతాలు, వ్యవసాయ పరిస్థితులు ప్రత్యక్షంగా ప్రభావితమవుతాయి. అక్టోబర్-డిసెంబర్ కాలంలో భారత ఉపఖండంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని WMO అంచనా వేస్తోంది. అయితే, 'ఇండియన్ ఓషన్ డైపోల్' (IOD) వంటి ఇతర వాతావరణ నమూనాలు కొన్ని సందర్భాల్లో ఎల్ నినో ప్రభావాన్ని కొంతవరకు తిప్పికొట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఇవన్నీ వాటి బలంపైన, సమయంపైన ఆధారపడి ఉంటాయి.

Super El Nino: ప్రపంచానికి భారీ నష్టం! భారత్‌కు 50 బిలియన్ల డాలర్ల షాక్
Super El Nino: ప్రపంచానికి భారీ నష్టం! భారత్‌కు 50 బిలియన్ల డాలర్ల షాక్

2027లో ఎలాంటి వాతావరణం ఉండబోతోంది?

2026 రికార్డులను 2027 బ్రేక్ చేస్తుందా లేదా అనేదానిపై ఖచ్చితమైన అంచనాలు చెప్పడం కష్టమైనప్పటికీ, 2027 ప్రారంభం వరకు ఎల్ నినో ప్రభావం మాత్రం కొనసాగుతుందని NOAA, WMO అంచనా వేస్తున్నాయి. ఈ వాతావరణ సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఎక్కువ లేదా తక్కువ వర్షాలు కురుస్తాయో ముందే హెచ్చరిస్తాయని, రాబోయే రోజుల్లో ఇది మానవాళికి పెద్ద సవాల్‌గా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+