ఎల్ నినో దెబ్బకు అమెజాన్, దాని ఉప నదులు సైతం ఎండిపోతున్నాయ్

ప్రపంచానికి ఊపిరితిత్తులుగా పిలిచే అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం ఇప్పుడు తీవ్ర పర్యావరణ సంక్షోభంలో కూరుకుపోయింది. పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకుంటున్న ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఏర్పడిన ఎల్ నినో ప్రభావంతో అమెజాన్ తో పాటు దాని నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి. అంచనా వేసిన సమయం కంటే చాలా ముందే నీటి ప్రవాహం తగ్గిపోతూ వస్తోంది. నదీతీర ప్రాంతాల్లోని వందలాది గిరిజన గ్రామాల్లో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయి.

సాధారణంగా నవంబర్ లేదా డిసెంబర్ లల్లో అమెజాన్ నది, దాని ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో కరవు సంభవిస్తుంటుంది. ఎల్ నినో దెబ్బకు ఈ సారి కొన్ని నెలల ముందే ఈ దుర్భిక్ష పరిస్థితులు తలెత్తాయి. పెరూ, బ్రెజిల్ లల్లో ప్రవహించే ఈ నదులపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ప్రజల రోజువారీ జీవితం ఇప్పుడు అస్తవ్యస్తమవుతోంది. వారి జీవనం స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఈ రెండు దేశాలు సహాయక కార్యక్రమాలను అందిస్తోన్నాయి.

El Nino intensified Triggers Rapid Amazon River Basin Water Decline Communities Face climate anomaly

పెరూ జాతీయ వాతావరణ సంస్థ సెనామ్హి వెల్లడించిన నివేదిక ప్రకారం.. ఆ దేశంలోని లోరెటో ప్రాంతంలో ప్రవహించే ప్రధాన అమెజాన్ నదుల నీటి మట్టాలు రోజురోజుకూ అత్యంత వేగంగా క్షీణిస్తున్నాయి. వర్షాలు లేకపోవడంతో రోజుకు కొన్ని సెంటీమీటర్ల చొప్పున నీరు అడుగంటిపోతోంది. ఇక్కడ నీటి మట్టాలు చారిత్రక సగటు కంటే చాలా తక్కువగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అమెజాన్ తో పాటు మారానన్, యుకయాలి, హువల్లాగా వంటి ప్రధాన ఉప నదుల పరివాహక ప్రాంతాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

గట్టిగా దెబ్బకొట్టిన ఎల్ నినో: విస్తుపోయే వాస్తవాలు
గట్టిగా దెబ్బకొట్టిన ఎల్ నినో: విస్తుపోయే వాస్తవాలు

జలవనరులు ఎండిపోతుండటం వల్ల స్థానికంగా సప్లై చైన్ కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. నదుల మధ్యలో కొత్త ఇసుక తిన్నెలు బయటపడుతున్నాయంటే అవి ఎంత వేగంగా ఎండిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. నీటి మట్టం తగ్గిపోతోండటం వల్ల లోరెటో ప్రాంతంలోని ఐక్విటోస్ సిటీతో పాటు ఇతర చిన్న చిన్న గ్రామాలకు నిత్యావసరాలు చేరవేసే రవాణా నౌకల ప్రయాణం రోజురోజుకూ క్లిష్టతరంగా మారుతోంది.

బంగారం ధరలను భారీగా దెబ్బ కొడుతున్న ఈ అంశాలు
బంగారం ధరలను భారీగా దెబ్బ కొడుతున్న ఈ అంశాలు

బ్రెజిల్‌లో కూడా గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెజాన్ నదికి అత్యంత కీలకమైన నార్త్ ట్రిబ్యుటరీ నెగ్రో రివర్ నీటిమట్టం.. 10 రోజుల్లో వ్యవధిలోనే దాదాపు 23 అంగుళాల మేర హఠాత్తుగా తగ్గిపోయింది. గత ఏడాదితో పోలిస్తే నీరు అత్యంత వేగంగా అడుగంటిపోతుండటం ఇక్కడి భయానక వాతావరణాన్ని ప్రతిబింబిస్తోందని బ్రెజిల్ మీడియా వెల్లడించింది. దీనివల్ల అమెజాన్ రివర్ బేసిన్, గ్రీన్ బెల్ట్, ఇతర వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంది.

తాష్కెంట్ లో ప్రధాని మోదీ అద్దిరిపోయే న్యూ లుక్- వెరీ సింపుల్, వెరీ క్యాజువల్
తాష్కెంట్ లో ప్రధాని మోదీ అద్దిరిపోయే న్యూ లుక్- వెరీ సింపుల్, వెరీ క్యాజువల్

సైంటిఫిక్ జర్నల్ నేచర్ ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం బ్రెజిల్‌లోని 1,300 కంటే ఎక్కువ గిరిజన గ్రామాలు, 1,800 గ్రామీణ ప్రాంతాలకు నేరుగా ఎలాంటి రోడ్డు సౌకర్యాలు లేదు. అవన్నీ కూడా జల రవాణాపైనే జీవనోపాధి పొందుతున్నాయి. నదీ ప్రవాహాలు నిలిచిపోతే కనీస వైద్యం, తాగునీరు, ఆహార సరఫరా స్తంభించిపోతుంది. అవి అందక ఈ నిరుపేద ఆదివాసి గ్రామాలు తీవ్ర కొరతను ఎదుర్కొంటాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

క్లైమెట్ ఛేంజ్, గ్రీన్ హౌస్ వాయువులతో ఇప్పటికే ఇబ్బందులు పడుతోంది అమెజాన్ నది పరీవాహక ప్రాంతం. ఇప్పుడు దీనికి ఎల్ నినో తోడు కావడం వల్ల ఈ సంక్షోభం మరింత ముదిరిందని, మొత్తం అమెజాన్ అటవీ వ్యవస్థనే కాకుండా, దాని గర్భంలో తరతరాలుగా జీవిస్తున్న ఆదిమ జాతుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+