నవంబర్ 13న యుగాంతం?.. 66 ఏళ్ల నాటి పేపర్‌లో ఏముంది!

వచ్చే నెల నవంబర్ 13వ తేదీన యుగాంతం రాబోతోందని, ప్రపంచం మొత్తం అంతమైపోతుందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారాలు ఊపందుకున్నాయి. ఫేస్‌బుక్, ఎక్స్ , ఇన్స్టాగ్రామ్‌లలో ఈ వార్త చూసి చాలామంది నిజంగానే భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఈ వార్తల వెనుక ఉన్న అసలు నిజాన్ని విశ్లేషిస్తే ఇదొక సాధారణ గణిత లెక్క మాత్రమే తప్ప, నిజమైన యుగాంతం కాదని స్పష్టమవుతోంది.

ఈ వార్తలకు మూలం ఇప్పటిది కాదు. 1960 నవంబర్‌లో ప్రముఖ 'సైన్స్' పత్రికలో "డూమ్స్‌డే: ఫ్రైడే, 13 నవంబర్, ఏడీ. 2026" పేరిట ఒక పరిశోధనా వ్యాసం ప్రచురితమైంది. ఆస్ట్రియాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త హైంజ్ వోన్ ఫోయెర్‌స్టర్ తన సహచరులతో కలిసి మానవ జనాభా పెరుగుదలపై ఒక అధ్యయనం చేశారు. ఆ సమయంలో ప్రపంచంలో జనాభా విపరీతంగా పెరుగుతుండటంతో.. క్రీస్తు పూర్వం నుంచి 1958 వరకు ఉన్న జనాభా డేటాను సేకరించి, ఒక మ్యాథ్స్ ఈక్వేషన్ రూపొందించారు.

Fact Check Will the World End on November 13 2026 The Truth Behind the Viral 1960 Doomsday Research Paper

జనాభా పెరిగి ఇరుక్కుని చనిపోతారట!

ఈ గణిత సూత్రం ప్రకారం జనాభా మామూలుగా కాకుండా అత్యంత వేగంగా పెరుగుతుందని వారు లెక్కలు వేశారు. ఈ లెక్కను భవిష్యత్తుకు విస్తరించినప్పుడు, ఒకానొక దశలో జనాభా సంఖ్య అనంతం (Infinity) వైపు వెళ్తుందని తేలింది. ఆ కచ్చితమైన ముగింపు తేదీనే 2026 నవంబర్ 13 అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. విశేషమేమిటంటే, ఆ తేదీ శాస్త్రవేత్త వోన్ ఫోయెర్‌స్టర్ సొంత పుట్టినరోజు కావడంతో, సరదాగా ఆ తేదీని ఎంచుకున్నట్లు అప్పట్లో ఆయన తెలిపారు. భూమిపై మనుషులు ఆకలితో కాకుండా, స్థలం సరిపోక ఒకరినొకరు తోసుకుంటూ ఇరుక్కుని చనిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.

60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు?
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు?

భయపడాల్సిన పనిలేదు.. ఇదొక ఊహాజనిత లెక్క మాత్రమే!

అయితే, ఈ లెక్కలకు నిజ జీవితానికి అస్సలు సంబంధం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గణిత సూత్రాలు స్థిరమైన రూల్స్ మీద పనిచేస్తాయి, కానీ మానవ సమాజం అలా ఉండదు. 1960 నాటి ఈ రీసెర్చ్ పేపర్.. భవిష్యత్తులోనూ జననాల రేటు, జీవన పరిస్థితులు మారకుండా అలాగే ఉంటాయని ఊహించి చేసిన లెక్క. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. ఆధునికత, పట్టణీకరణ పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు బాగా తగ్గిపోయింది.

Doomsday clock హెచ్చరికలు; 85 సెకన్ల దూరంలో వినాశనం
Doomsday clock హెచ్చరికలు; 85 సెకన్ల దూరంలో వినాశనం

సాధారణ రోజులాగే గడిచిపోతుంది!

ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 8.2 బిలియన్లు (820 కోట్లు)గా ఉంటే, ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2080 నాటికి జనాభా 1000 కోట్లకు చేరి, ఆ తర్వాత స్థిరపడటం లేదా తగ్గడం జరుగుతుంది. కాబట్టి అరవై ఏళ్ల కిందట ఒక పేపర్‌పై వేసుకున్న గణిత లెక్కలను పట్టుకుని ప్రపంచం అంతమైపోతుందని భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే నవంబర్ 13 కూడా మిగతా రోజుల్లాగే ఒక సాధారణ రోజే అని స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+