చందమామపై బ్లూ ఘోస్ట్- భారీగా లావా ప్రవాహం..?!
Blue Ghost Spacecraft: చందమామపై మరో సరికొత్త ప్రయోగానికి తెర లేచింది. అమెరికాకు చెందిన ఓ ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ పరిశోధనలకు పూనుకుంది. ఈ సంస్థ పంపించిన స్పేస్‌క్రాఫ్ట్ నేడు చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ల్యాండింగ్ సజావుగా సాగుతుందా? లేదా? అనేది ఉత్కంఠభరితంగా మారింది.
సాఫ్ట్ ల్యాాండింగ్..
2023లో భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్.. చంద్రుడిపై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దాని తరువాత మళ్లీ జాబిల్లిపై ఓ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ కాబోతోండటం ఇదే తొలిసారి. సాఫ్ట్ ల్యాండింగ్‌పై అందరి దృష్టీ నిలిచింది. తాజా పరిశోధనలు సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రబిందువు అవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

నెలన్నర రోజుల ప్రయాణం..
ఆ స్పేస్ క్రాఫ్ట్ పేరు- బ్లూ ఘోస్ట్. అమెరికా టెక్సాస్‌కు చెందిన ఫైర్ ఫ్లై అనే సంస్థ దీన్ని పంపించింది. ఈ ఏడాది జనవరి 15వ తేదీన ఫ్లోరిడా మెరిట్ ఐలాండ్స్‌లో గల నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిందీ బ్లూ డ్రాగన్. నేడు జాబిల్లిపై అడుగు మోపబోతోంది.
సజావుగా జర్నీ..
ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ జోన్ ప్రకారం తెల్లవారు జామున 3:34, భారత కాలమానం ప్రకారం చూసుకుంటే ఈ మధ్యాహ్నం 2:04 నిమిషాలకు ఇది చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. ఇప్పటివరకూ దీని ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు సంభవించలేదు. అంతా సవ్యంగా ఉన్నట్లు ఫైర్ ఫ్లై సంస్థ ప్రకటించింది. అదే తరహాలో ల్యాండింగ్ కూడా సజావుగా సాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
మేర్ క్రీసియం..
ల్యాండింగ్ కోసం చందమామపై గల మేర్ క్రీసియం ప్రాంతాన్ని ఎంచుకుంది ఫైర్ ఫ్లై. మేర్ క్రీసియం అనేది ఓ బేసిన్. ఈశాన్య క్వాడ్రంట్ దిశలో ఉంటుందిది. దీని విస్తీర్ణం 740 కిలో మీటర్లు. 3.92 బిలియన్ సంవత్సరాల కిందట నెక్టేరియన్ యుగంలో ఇది ఏర్పడి ఉంటుందని నాసా గతంలో ప్రకటించింది.
At this point in our roadtrip, we're 12 hours away from parking our lunar lander on the Moon! Blue Ghost is getting ready to begin a series of descent operations to prepare for a soft touchdown. During these final hours of travel, we'll provide live updates here and on our #BGM1… pic.twitter.com/WWuwytksbc
— Firefly Aerospace (@Firefly_Space) March 1, 2025
లావా ప్రవాహం..
లూనార్ ఆర్బిటర్ లేజర్ ఆల్టీమీటర్ డేటా ప్రకారం చంద్రుడి ఉపరితలం నుంచి 1.8 కిలో మీటర్లు దిగువన ఉంటుందీ క్రీసియం. దీని బయటి అంచు ఎత్తు 3.34 కిలో మీటర్లు. ఇందులో లావా ప్రవాహ లక్షణాలు ఉన్నట్లు గతంలో నాసా గుర్తించింది. ఇప్పుడు దీని మీదే ఫైర్ ఫ్లై సంస్థ పరిశోధనలు చేసే అవకాశాలు ఉన్నాయి. 1960-70 మధ్యకాలంలో అప్పటి సోవియట్ యూనియన్ రెండుసార్లు దీనిపై పరిశోధనలు సాగించింది.












Click it and Unblock the Notifications