100 ఏళ్ల తర్వాత వెలుగులోకి సరికొత్త చిరుత పిల్లి! డీఎన్‌ఏ టెస్టులో తేలిన నిజం

సైన్స్ ప్రపంచం ఊహించని ఒక మహా వింత వెలుగులోకి వచ్చింది. గత వంద సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా, పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే ఒక కొత్త రకం పిల్లి జాతిని శాస్త్రవేత్తలు గుర్గించారు. బొలీవియాలోని దట్టమైన అడవుల్లో కనిపించిన ఈ విచిత్ర జీవిని మొదట్లో అందరూ సాధారణ పెంపుడు పిల్లే అనుకున్నారు. కానీ లోతుగా పరిశోధిస్తే.. అది పెంపుడు పిల్లి కాదు, ప్రపంచంలోనే ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక అరుదైన అడవి పిల్లి జాతి అని తేలింది! సైన్స్ ప్రపంచంలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ పులి మచ్చల పిల్లికి శాస్త్రవేత్తలు 'లియోపార్డస్ టిల్కాయో' (Leopardus tilcayo) అని నామకరణం చేశారు.

ఈ ఆసక్తికర ప్రయాణం 2016లో మొదలైంది. బొలీవియాకు చెందిన వన్యప్రాణి పరిశోధకురాలు పాఓలా నొగాలెస్ అస్కారన్స్ వద్దకు ఒక విచిత్రమైన ఫోన్ కాల్ వచ్చింది. అడవి రోడ్డు పక్కన పడి ఉన్న ఒక చిన్న పిల్లి పిల్లను సాధారణ పెంపుడు పిల్లి అనుకుని ఒక వ్యక్తి ఏడాది పాటు ఇంట్లో పెంచుకున్నాడు. కానీ అది ఎదుగుతున్న కొద్దీ అడవి జంతువు లక్షణాలు చూపించడంతో, భయపడి జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించాడు. అక్కడ పరిశోధకురాలు పాఓలా ఆ పిల్లిని చూసి ఆశ్చర్యపోయారు. చిన్నపాటి ముఖం, గుండ్రటి చెవులు, పొడవాటి మీసాలు.. అన్నింటికంటే ముఖ్యంగా ఒంటిపై చిరుత పులిని తలపించే మచ్చలు ఉన్నాయి!

First New Cat Species Discovered in 100 Years Meet Leopardus Tilcayo Found in Bolivia Forests
పులి ఎముకలు, చిరుత చర్మాలు.. అరుదైన జీవుల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
పులి ఎముకలు, చిరుత చర్మాలు.. అరుదైన జీవుల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

జినెటిక్ టెస్టులో తేలిన అసలు నిజం: 14 లక్షల ఏళ్ల నాటి చరిత్ర!

మొదట్లో దీనిని ఇప్పటికే గుర్తింపు పొందిన 'టైగర్ క్యాట్' జాతికి చెందినదిగా భావించారు. అయితే 2019లో బ్రెజిల్, బెల్జియంకు చెందిన జన్యు శాస్త్రవేత్తలతో కలిసి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా అసలు సంచలనం బయటపడింది. ఈ పిల్లి సాధారణ జాతి కాదని, సుమారు 14 లక్షల సంవత్సరాల క్రితమే ఇతర అడవి పిల్లుల నుంచి వేరుపడి ప్రత్యేకంగా పరిణామం చెందిన ఒక విభిన్నమైన జీవి అని తేలింది! మన ఇళ్లల్లో తిరిగే పెంపుడు పిల్లి కంటే చాలా చిన్నగా, కేవలం కిలోన్నర బరువు, 18 అంగుళాల పొడవుతో చిన్న చిరుత పిల్లలా కనిపిస్తుంది.

అంతరించిపోతున్న అరుదైన చిరుత. భారీ సెక్యూరిటీతో మాస్టర్ ప్లాన్
అంతరించిపోతున్న అరుదైన చిరుత. భారీ సెక్యూరిటీతో మాస్టర్ ప్లాన్

వంద ఏళ్ల రికార్డ్.. ఇంకా చేధించాల్సిన రహస్యాలు ఎన్నో!

1923 తర్వాత ఒక కొత్త పిల్లి జాతిని శాస్త్రీయంగా గుర్తించడం మళ్లీ ఇప్పుడే కావడం వన్యప్రాణి రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. స్థానిక ప్రజలు దీనిని 'టిల్కాయో' అని పిలుస్తుండటంతో, శాస్త్రవేత్తలు కూడా అదే పేరును ఖరారు చేశారు. అయితే ఈ అరుదైన పిల్లులు అడవుల్లో ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇవి ఏం తింటాయి? ఎలా సంతానోత్పత్తి చేస్తాయి? అనే ప్రాథమిక విషయాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మానవుడి కంటికి చిక్కకుండా దాగున్న వింతలు ఇంకా ఎన్నో ఉన్నాయని ఈ 'లియోపార్డస్ టిల్కాయో' ఆవిష్కరణ మరోసారి నిరూపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+