ప్రపంచంలోనే ఫస్ట్ టైమ్.. 'సోలార్' ల్యాప్‌టాప్‌ లాంఛ్ చేసిన లెనోవో

ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం లెనోవో సరికొత్త ల్యాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అల్ట్రాస్లిమ్‌ సోలార్‌ పవర్‌ ల్యాప్‌టాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు టెక్ పరిశ్రమలో అతిపెద్ద ఈవెంట్లలో ఒకటైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో దీన్ని ప్రదర్శించింది. ఈ కార్యక్రమం మార్చి 3 నుంచి మార్చి 6 వరకు బార్సిలోనా లోని ఫిరా గ్రాన్ వియాలో నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ టెక్ కంపెనీలు వారి లేటెస్ట్ ప్రొడక్ట్స్ లని ఇక్కడ లాంఛ్ చేస్తున్నాయి.

ప్రపంచంలో తొలిసారి..

2025లో లెనోవా ప్రవేశపెట్టిన అన్ని ఉత్పత్తుల్లో వెరీవెరీ స్పెషల్‌ గా చెబుతున్నారు. యోగా సోలార్‌ పీసీగా పిలుస్తున్న దీన్ని 20 నిమిషాల పాటు సోలార్‌ చార్జింగ్‌ చేస్తే సుమారు గంట పాటు ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చని అంటున్నారు. ఇండోర్ ప్రదేశాల్లోనే కాకుండా ఇంటి బయట, పార్కులో, రోడ్డు మీద, స్టేషన్ వంటి బహిరంగ ప్రదేశాల్లో పని చేయాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌ అని లెనోవో ప్రకటించిండి. ఇది ప్రపంచంలోనే మొదటి అల్ట్రాస్లిమ్‌ సోలార్‌ పీసీగా పేర్కొంది.

For the first time in the world Lenovo has launched a Solar laptop

అంతే కాకుండా భవిష్యత్తులో సోలార్‌ ఆధారిత టెక్నాలజీకి ఇది ఊతమిస్తుందని వెల్లడించారు. లెనోవో అభివృద్ధి చేసిన ఈ ల్యాప్‌టాప్‌ వెలుపలి భాగంలో ఉండే రిమూవబుల్‌ కవర్‌లో సోలార్‌ ప్యానెల్‌ అమర్చి ఉంటుంది. ఇందులో 84 బ్యాక్‌ కాంటాక్ట్‌ సోలార్‌ సెల్స్‌ ఉంటాయి. ఈ డిజైన్‌ సూర్యకాంతి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే కన్వర్షన్‌ రేటు 24 శాతం కలిగి ఉంటుంది. ఇది సిలికాన్‌ ఆధారిత సంప్రదాయ ప్యానెల్‌ కంటే అధికమని స్పష్టం చేసింది. ఇంటెల్‌ కోర్‌ అల్ట్రా ప్రాసెసర్‌తో ఈ ల్యాపీ పనిచేస్తుందని తెలిపారు.

ఆవిష్కరణలను ఈ ఎండబ్ల్యూసీ 2025 (MWC 2025)లో ఆవిష్కరిస్తారు. ప్రతి ఏడాది భవిష్యత్తును నిర్వహించే సాంకేతికతలను ప్రివ్యూ చేసేందుకు ఎండబ్ల్యూసీ అద్భుతమైన వేదికగా పనిచేస్తుంది. ఈ ఏడాది ఈ ఈవెంట్ ను కన్వర్జ్ థీమ్ (Converge Theme) కింద నిర్వహిస్తున్నారు. ఈ ల్యాపీ 15mm మందం, 1.22 కిలోల బరువు ఉంటుంది.

ప్రపంచమంతా సోలార్‌ వైపు పరుగులు తీస్తున్న తరుణంలో తాము ఈ కాన్సెప్ట్‌తో ల్యాపీ తీసుకురావడంపై సంతోషంగా ఉన్నట్లు లెనోవో పేర్కొంది. అయితే దీని ప్రొడక్షన్‌ గురించి కంపెనీ ఎటువంటి వివరాల్ని కంపెనీ వెల్లడించలేదు. కొత్త మొబైళ్లు, సరికొత్త సాంకేతికతతో రూపొందిన గ్యాడ్జెట్ల ఆవిష్కరణలకు మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ వేదికగా నిలుస్తుంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+