Google Pixel 10a ఫీచర్స్ లీక్.. ధర ఎంతంటే ??
Google Pixel 10a స్మార్ట్‌ఫోన్ గురించి టెక్ ప్రపంచంలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సాధారణంగా ఏడాది మధ్యలో వచ్చే 'a' సిరీస్ మోడల్‌కు భిన్నంగా, ఈసారి Pixel 10a అంచనాల కంటే ముందే మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా వెలువడిన లీక్‌ల ప్రకారం, గూగుల్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి మధ్యలోనే విడుదల చేయవచ్చని సమాచారం.
విశ్వసనీయ వివరాల ప్రకారం.. Pixel 10a ఇప్పటికే ప్రొడక్షన్ చివరి దశలో ఉండటంతో త్వరితగతిన లాంచ్‌కు సిద్ధమవుతోంది. డిస్‌ప్లే, బ్యాటరీ, కలర్ ఆప్షన్లు, గూగుల్ కెమెరా అనుభవం వల్ల వినియోగదారుల్లో ఆసక్తిని పెంచుతోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ లీక్‌లను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Google Pixel 10a లీక్ ఫీచర్స్..
కొత్త డిజైన్, ఆకర్షణీయమైన రంగులు
Pixel 10a లో గూగుల్ కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేయనుందని లీక్‌లు సూచిస్తున్నాయి. Obsidian, Berry, Fog, Lavender వంటి ట్రెండీ రంగులు ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవి గత Pixel 'a' సిరీస్ ఫోన్లలో కనిపించని కొత్త షేడ్స్ కావడం విశేషం.
స్టోరేజ్..
స్టోరేజ్ విషయంలో 128GB, 256GB వేరియంట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
డిస్‌ప్లే..
లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం, Pixel 10a లో 6.28 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది FHD+ రిజల్యూషన్‌తో పాటు 130Hz రిఫ్రెష్ రేట్‌ను అందించవచ్చని తెలుస్తోంది. ఈ రిఫ్రెష్ రేట్ బడ్జెట్ ఫోన్ సెగ్మెంట్‌లో గూగుల్‌కు మంచి ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ అనుభూతి మెరుగవుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
కెమెరా..
కెమెరా విషయంలో గూగుల్ తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది. Pixel 10a వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుందని లీక్‌లు చెబుతున్నాయి. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ కారణంగా, హార్డ్‌వేర్ పెద్దగా మారకపోయినా ఫోటో క్వాలిటీ మాత్రం ఆకట్టుకునేలా ఉండనుంది.
బ్యాటరీ, ర్యామ్..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB RAM ఉండనుందని, అలాగే 5,100mAh భారీ బ్యాటరీ అందించవచ్చని సమాచారం. ఇది రోజంతా ఉపయోగించుకునేలా మంచి బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుందని అంచనా. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రాసెసర్..
Pixel 10a లో ఉపయోగించే ప్రాసెసర్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. సాధారణంగా Tensor G4 చిప్ ఉంటుందని అంచనా వేసినా, కొన్ని లీక్‌లు గూగుల్ ఇంకా అధికారికంగా విడుదల చేయని Tensor G5 చిప్‌ను ఇందులో ఇవ్వవచ్చని సూచిస్తున్నాయి. నిజంగా Tensor G5 ఉంటే, పనితీరు పరంగా ఇది పెద్ద అప్‌గ్రేడ్‌గా మారుతుంది. అయితే గూగుల్ అధికారికంగా ప్రకటించే వరకు ఈ విషయాన్ని కేవలం పుకార్లుగానే చూడాల్సి ఉంటుంది.
ధర, లాంచ్‌పై అంచనాలు..
Pixel 10a ధర కూడా బడ్జెట్‌కు దగ్గరగానే ఉండే అవకాశం ఉంది. గత మోడల్స్‌ను బట్టి చూస్తే, ఇది మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో పోటీదారులకు గట్టి సవాల్ విసిరేలా ఉండొచ్చు. ఫిబ్రవరిలో లాంచ్ జరిగితే, సంవత్సర ఆరంభంలోనే గూగుల్ బడ్జెట్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు అవుతుంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications