Google feature: గాలి కాలుష్యంపై యుద్ధంలోకి గూగుల్ స్టెప్‌ ఇన్.. ఈ ఫీచర్‌తో ఎంతో బెనిఫిట్

Air pollution: ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలను కస్టమర్లకు అందించడంలో టెక్ దిగ్గజం గూగుల్ ముందుంటుంది. దేశంలో ఢిల్లీ సహా పలు నగరాల్లో గాలి కాలుష్యం తీవ్రత పెరుగుతుండటంపై ఇటీవల పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన ఓ ఫీచర్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. దీని ద్వారా కేవలం ఎంచుకున్న ప్రదేశానికి నావిగేషన్ మాత్రమే కాకుండా గాలి నాణ్యత సమాచారం కూడా తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

గూగుల్ పరిచయం చేసిన ఎయిర్ వ్యూ+ ఫీచర్ వివిధ ప్రాంతాలలో గాలి నాణ్యత గురించి యూజర్లకు అంతర్దృష్టులను అందిస్తుంది. AI-ఆధారంగా ఈ పర్యావరణ వ్యవస్థ పనిచేస్తుంది. 150కి పైగా నగరాలకు సంబంధించిన గాలి నాణ్యత డేటాను తెలియజేస్తుంది. తద్వారా ప్రభుత్వంతో పాటు పౌరులకు కూడా గాలి కాలుష్యం తీవ్రతను చాలా తేలికగా తెలుసుకనే వెసులుబాటు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Google provided air view feature to track real time AQI

ఉష్ణోగ్రత మరియు తేమతో పాటుగా PM2.5, PM10, CO2, NO2, ఓజోన్ మరియు VOCల వంటి కాలుష్య కారకాలను ఎయిర్ వ్యూ+ పర్యవేక్షిస్తుంది. గూగుల్ తన AI టెక్నాలజీ సహాయంతో అధునాతన గాలి నాణ్యత సెన్సార్‌లను మ్యాప్స్‌కి అనుసంధానించింది. ఇందుకోసం టెక్ దిగ్గజం స్థానిక క్లైమేట్-టెక్ సంస్థలతో కలిసి పని చేస్తుంది. ఈ వ్యవస్థ రియల్ టైం డేటాను అందిస్తుంది. IIT ఢిల్లీ, IIT హైదరాబాద్ సహా ఇతర సంస్థల పరిశోధకులు కూడా దీని పనితీరును ధ్రువీకరించారు.

కాలుష్య హాట్‌స్పాట్‌లను గుర్తించడానికి, దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను అమలు చేయడానికి ప్రభుత్వ సంస్థలు తమ నగరాల్లోని హైపర్‌లోకల్ ఎయిర్ క్వాలిటీ డ్యాష్‌బోర్డ్‌లను ఉపయోగించుకోవచ్చు. ఇవి మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో కూడా సమర్థవంతమైన పర్యవేక్షణకు అనుమతిస్తాయి. ఇక ప్రజలు నేరుగా గూగుల్ మ్యాప్స్ ద్వారా రియల్ టైం గాలి నాణ్యత డేటాను యాక్సెస్ చేయవచ్చు.

పిల్లలు మరియు వృద్ధులకు హాని కలిగించే స్థాయికి కాలుష్యం చేరినప్పుడు ఈ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా N95 మాస్క్‌ల వంటి రక్షణాత్మక విధానాలను ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం సింపుల్‌గా గూగుల్ మ్యాప్స్‌లోని ఎయిర్ క్వాలిటీ ఆప్షన్‌ను వినియోగించాలి. హోమ్ స్క్రీన్‌పై లేయర్‌ బటన్‌ ఎంచుకుని ఎంచుకున్న లొకేషన్‌లో AQI కోసం ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లోని వెదర్ విడ్జెట్‌ చెక్‌ చేస్తే సరిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+