చందమామను గమనించారా- అత్యంత ప్రకాశవంతంగా కనిపించే గ్రహం ఏమిటో తెలుసా?
Moon: అంతరిక్షం..అద్భుతాలమయం. పరిశోధించే కొద్దీ- కొత్త సంగతులు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ఏ చిన్న వార్తయినా ఆసక్తి రేపుతుంది. ఎక్కడో పాలపుంతలకు అవతల సుదూర తీరాల్లో కొత్త గ్రహాలను కనుగొనడం, కృష్ణబిలాలు, తొక్కచుక్కలు, గ్రహశకలాలు భూమికి చేరువగా ప్రయాణించడం వంటి వార్తలు ఎప్పుడూ ఆసక్తిని కలగజేసేవే.
అలాంటి ఉదంతాల్లో ఒకటి ప్లానెట్ వీనస్. శుక్రగ్రహంగా పిలుస్తారు. సూర్యుడి నుంచి చూసుకుంటే రెండోది.. భూమికి అతి చేరువగా ఉండే గ్రహం ఇది. భూమి బరువు, వైశాల్యంతో పోల్చుకుంటే దాదాపు సమానంగా ఉంటుంది. భూమికి ట్విన్స్‌గా భావిస్తుంటారు. వాతావరణం మాత్రం పూర్తి భిన్నం.

దీని వాతావరణం మొత్తం కార్బన్ డయాక్సైడ్ నిండివుంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిగిన దట్టమైన మేఘాలతో కప్పి ఉంటుంది. సూర్యుడికి సమీపంలో ఉండటం వల్ల సౌర తుఫాన్లు సర్వసాధారణం ఈ శుక్రగ్రహంపై. అలాగే- క్రియాశీలకంగా ఉండే అగ్నిపర్వతాలు ఎన్నో ఉంటాయి. నిత్యం రగులుతూనే ఉంటాయి.
బుధగ్రహం (మెర్క్యురి) తరహాలోనే దీనికీ చందమామలు ఉండవు. మొత్తం పాలపుంతలో చందమామలు లేని గ్రహాలు ఈ రెండే. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి 365 రోజులు పడితే వీనస్‌కు పట్టేది 224 రోజులే. భూమి నుంచి నేరుగా చూడదగ్గ గ్రహాల్లో ఇదీ ఒకటి.
అలాంటి ప్లానెట్ వీనస్‌ను.. ఇప్పుడు మనం నేరుగా చూసే అవకాశం లభించింది. చంద్రుడికి కొంత ఎత్తులో ప్రకాశవంతంగా, మెరిసిపోతూ కనువిందు చేస్తోందీ గ్రహం. మరో వారం రోజుల పాటు సూర్యాస్తమయం తరువాత కంటికి కనిపిస్తుంది. చంద్రుడికి అత్యంత సమీపానికి వస్తుంటుంది.
— Stuart Atkinson (@mars_stu) January 3, 2025
చందమామ- వీనస్ ఫొటోలను బ్రిటన్‌కు చెందిన స్టువర్ట్ అట్కిన్సన్ అనే అమెచ్యుర్ ఆస్ట్రనామర్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వివిధ ప్రాంతాల్లో విభిన్న రీతుల్లో తీసిన ఫొటోలు అవి. వాటిని తీయడానికి సోలార్ టెలిస్కోప్‌లను వినియోగించారు.
— Stuart Atkinson (@mars_stu) January 4, 2025
ఒక్క బ్రిటన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చంద్రుడికి అత్యంత సమీపంలో మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తోంది ప్లానెట్ వీనస్. ఎలాంటి బైనాక్యులర్లు, టెలిస్కోప్‌లు లేకుండా నేరుగా ఆ గ్రహాన్ని మనం చూడొచ్చు. మనదేశంలో కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచీ చంద్రుడు- వీనస్‌ను నేరుగా చూడగలం.












Click it and Unblock the Notifications