Honda electric: ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌కు హోండా రెడీ.. ఆ ఫీచర్స్‌తో ప్రత్యర్థులకు గట్టి పోటీ
Activa electric: ద్విచక్ర వాహనాల సెగ్మెంట్‌లో భారతీయ మర్కెట్‌లో హోండాకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా యాక్టివాపై యువత సహా వయసు పైబడిన వారిలోనూ ఎంతో క్రేజ్ ఉంది. ప్రస్తుతం దేశమంతా సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఇంధనం నుంచి ఎలక్ట్రిక్ దిశగా మారే ప్రయత్నంలో ఉంది. దీన్ని గుర్తించిన హోండా తన కస్టమర్లకు ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
భారతీయ మార్కెట్ కోసం హోండా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'యాక్టివా ఎలక్ట్రిక్'ను ఆవిష్కరించనుంది. దీనికోసం పలువురు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ వినూత్న ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు. తేలికగా మార్చుకోగల బ్యాటరీ వ్యవస్థ దీని ముఖ్య ఫీచర్స్‌లో ఒకటిగా చెబుతున్నారు.

తద్వారా వినియోగదారులు వాటిని ఇంట్లో లేదా కార్యాలయంలో సౌకర్యవంతంగా ఛార్జ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. దీంతో పార్కింగ్ ఏరియాల్లో ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లు నెలకొల్పాల్సిన అవసరం ఉండదు. దీనికి అదనంగా హోండా కూడా సొంతగా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే వినియోగదారులు ఖాళీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసిన దానితో సెకన్ల వ్యవధిలోనే మార్చుకోవచ్చు.
యాక్టివా ఎలక్ట్రిక్ టాప్ వేరియంట్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. నావిగేషన్ మరియు మ్యూజిక్ కంట్రోల్స్‌ను హోండా అందిస్తుంది. ఇక తక్కువ వేరియంట్‌లలో ప్రాథమిక LCD స్క్రీన్ వస్తుంది. స్టాండర్డ్ మరియు స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్స్ ఎంచుకుకోవచ్చు. స్టాండర్డ్ మోడ్ సాధారణ వినియోగానికి కాగా స్పోర్ట్ ద్వారా అధిక వేగాన్ని అందుకోవచ్చు.
ప్రతి ఛార్జ్‌కి 104 కి.మీల పరిధిని యాక్టివా ఎలక్ట్రిక్ అందజేస్తుందని కంపెనీ చెబుతోంది. విడా V1 మరియు అథర్ రిజ్టా వంటి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు ఇది గట్టి పోటీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో ఇతర EV స్కూటర్లు ఉన్నప్పటికీ రిమూవబుల్ బ్యాటరీ ఫీచర్ మరియు బలమైన బ్రాండ్ ఇమేజ్ కస్టమర్లను ఆకర్షించగలదని విశ్వసిస్తున్నారు. పట్టణ ప్రయాణీకులకు ఓ చక్కటి ఎంపికగా భావించవచ్చు.












Click it and Unblock the Notifications