దిమ్మతిరిగే ఫీచర్లతో HONOR POWER.. 8,000 బ్యాటరీ !

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రోజుకో కొత్త ఫోన్ మార్కెట్ లోకి వచ్చేస్తోంది. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు కస్టమర్లను ఆకర్షించేందుకు దిగ్గజ కంపెనీలు సైతం పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మొబైల్ బ్రాండ్ హానర్ తాజాగా తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ 'హానర్ పవర్' ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక టెక్నాలజీ, పవర్ ఫుల్ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లతో ఇండియా మార్కెట్లో కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది.

HONOR POWER ఫీచర్స్...

డిస్ ‌ప్లే..

ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. స్క్రోలింగ్, గేమింగ్‌ను స్మూత్‌గా ఉండేందుకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అలానే 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కళ్ళకు హానికరం కాకుండా కాపాడుతోంది.

ప్రాసెసర్..

Snapdragon 7 Gen 3 (4nm) ప్రాసెసర్.. Adreno 720 GPU తో ఈ ఫోన్ లభిస్తుంది. Android 15 ఆధారిత Magic OS 9.0 - కొత్త UI, మెరుగైన కస్టమైజేషన్, AI ఆధారిత ఫీచర్లు కూడా ఉన్నాయి.

honor-power-with-stunning-features-8-000-battery

స్టోరేజ్..

8GB / 12GB RAM, 256GB / 512GB ROM

డిజైన్..

హానర్ పవర్‌ ప్రత్యేకమైన టెన్-సైడెడ్ యాంటీ-ఫాల్ షాక్ అబ్సర్బింగ్ స్ట్రక్చర్ 2.0 తో తయారైంది. అదేవిధంగా 360° వాటర్‌ప్రూఫ్ బాడీతో దీన్ని రూపొందించారు. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్ కూడా ఇందులో పొందుపరిచారు.

కెమెరా..

బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో ప్రొఫెషనల్ లెవెల్ వీడియోస్ కోసం కూడా ఇది పనిచేస్తోందని అంటున్నారు.
16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ..

మొబైల్ చరిత్రలో నిజంగా ఇది ఒక మైలు రాయి అని చెప్పవచ్చు. 8000mAh బ్యాటరీ ఉంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్ తక్కువ టైంలో ఫుల్ ఛార్జ్ ఎక్కేందుకు ఇది సహకరిస్తుంది. 6 సంవత్సరాల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని చెబుతున్నారు.

కలర్స్..

Snow White, Phantom Night Black, Desert Gold ఈ మూడు రంగుల్లో ఫోన్ లభిస్తుంది.

ధరలు..

8GB + 256GB - ¥1,999 (సుమారు ₹23,310)

12GB + 256GB - ¥2,199 (సుమారు ₹25,640)

12GB + 512GB - ¥2,499 (సుమారు ₹29,140)

హానర్ ఫోన్స్ లను ఇష్టపడే వారికి ఇదిఒక మంచి ఆఫర్ అని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+