Instants: ఇదెక్కడి తొక్కలో ఫీచర్ రా బాబు! ఇలా ఆపేయండి..

రోజూ ఉదయాన్నే కళ్లు తెరవగానే ఫోన్ పట్టుకుని బాత్‌రూమ్‌లోకి వెళ్లడం.. అక్కడ కమోడ్‌పై కూర్చుని ప్రశాంతంగా ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఓపెన్ చేసి రీల్స్ చూస్తూ వాటని షేర్ చేసి.. ఫ్రెండ్స్‌తో చాట్ చేయడం ఈ తరం యూత్ కి ఒక అలవాటు. కానీ, ఒకవేళ మీరు కూడా అదే పని చేస్తుంటే మాత్రం కాస్త జాగ్రత్త! ఎందుకంటే మీరు నిద్రమత్తులో చాట్ బాక్స్ ఓపెన్ చేయబోతే.. పొరపాటున అక్కడ ఉన్న కొత్త బటన్ నొక్కితే చాలు, మీరు బాత్‌రూమ్‌లో ఉన్న ఫోటో ఎడిటింగ్ లేకుండా, ఎలాంటి పర్మిషన్ అడగకుండా అవతలి వ్యక్తికి ముఖం మీదే వెళ్ళిపోతుంది! వినడానికి షాకింగ్‌గా ఉన్నా.. ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా తీసుకొచ్చిన 'ఇన్‌స్టాంట్స్' (Instants) ఫీచర్ ఇప్పుడు నెటిజన్లకు ఇవే చుక్కలు చూపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో "ఇదెక్కడి తొక్కలో ఫీచర్ రా బాబు.. మా పరువు తీసేలా ఉంది!" అంటూ యూజర్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం ఇన్‌బాక్స్ (DM) లో కింద కుడివైపు మూలన ఒక కొత్త ఫోటోల స్టాక్‌ను 'ఇన్‌స్టాంట్స్' పేరుతో చేర్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. దీనిపై క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. మనం ఫోటో తీసి ఎడిట్ చేయడానికి గానీ, ఫిల్టర్లు పెట్టడానికి గానీ, 'సెండ్' నొక్కడానికి గానీ ఎలాంటి ఆప్షన్ ఉండదు. క్లిక్ చేయడమే ఆలస్యం.. ఆ ఫోటో ఇన్‌స్టంట్‌గా అవతలి వారికి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడూ పర్‌ఫెక్ట్ ఫోటోలనే షేర్ చేసుకోవడానికి ఇష్టపడే ఇన్‌స్టా ప్లాట్‌ఫామ్‌పై.. ఇలాంటి 'నో-ఫిల్టర్, నో-ఎడిట్' డైరెక్ట్ ఫీచర్ పెట్టడం నెటిజన్లకు అస్సలు నచ్చడం లేదు.

How To Turn Off Instagram Instants Step By Step Guide To Disable Hide Instants In Inbox Feature On App

"ఇది అస్సలు సేఫ్ కాదు బాబోయ్!".. నెటిజన్ల లబోదిబో

ఈ ఫీచర్ గ్లోబల్‌గా రోల్ అవుట్ అయినప్పటి నుండి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నెటిజన్లు ఇన్‌స్టాపై జోకులు, ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. "భయ్యా.. ఈ కొత్త ఇన్‌స్టా ఇన్‌స్టాంట్ అస్సలు సేఫ్ కాదు. పొరపాటున టచ్ అయినా కొంప మునిగిపోద్ది" అని రాసుకొచ్చాడు.

మరో నెటిజన్ అయితే.. "అసలు ఇన్‌స్టాగ్రామ్ ఏం చేయాలనుకుంటోంది? ఈ చెత్త ఫీచర్‌ను ఇప్పుడే ఆపేయండి" అంటూ పచ్చిగా తిట్టిపోశాడు. ఈ ఫీచర్ ద్వారా పంపే ఫోటోలు అవతలి వ్యక్తి ఒక్కసారి చూశాక మాయమైపోతాయని, స్క్రీన్ షాట్స్ లేదా స్క్రీన్ రికార్డింగ్స్ తీయడం కుదరదని ఇన్‌స్టా చెబుతున్నప్పటికీ.. ప్రైవసీ పరంగా ఇది తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ కేవలం అమ్మాయిల కోసమే - ఎలాన్‌ మస్క్‌
ఇన్‌స్టాగ్రామ్‌ కేవలం అమ్మాయిల కోసమే - ఎలాన్‌ మస్క్‌

ఈ ఫీచర్‌ను ఆపేయడం ఎలా? (How to turn off Instants)

ఈ కొత్త అప్‌డేట్ నచ్చని చాలామంది యూజర్లు.. దీని నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. దీన్ని ఎలా డిసేబుల్ చేయాలో నెటిజన్లు ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు:

  • ముందుగా మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోకి వెళ్లండి.
  • పైన కుడివైపు ఉన్న 'త్రీ-లైన్స్' (మెనూ) క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
  • కిందకు స్క్రోల్ చేసి "కంటెంట్ ప్రిఫరెన్సెస్" (Content Preferences) ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • అక్కడ ఉన్న "హైడ్ ఇన్‌స్టాంట్స్ ఇన్ ఇన్‌బాక్స్" (Hide Instants in Inbox) అనే టోగుల్ బటన్‌ను ఆన్ (Turn On) చేయండి.
Instagram పదే పదే అదే రీల్స్? సింపుల్‌గా ఇలా ఫిక్స్ చేయండి
Instagram పదే పదే అదే రీల్స్? సింపుల్‌గా ఇలా ఫిక్స్ చేయండి

ఇలా చేస్తే మీ ఇన్‌బాక్స్ నుండి ఆ 'ఇన్‌స్టాంట్స్' ఐకాన్ మాయమైపోతుంది. అలాగే ఇతరులు మీకు పంపే ఇన్‌స్టాంట్స్ కూడా మీకు కనిపించవు. మీ పరువు బజారున పడకుండా ప్రశాంతంగా ఇన్‌స్టా వాడుకోవాలంటే వెంటనే ఈ సెట్టింగ్ మార్చుకోవడం మంచిదని టెక్ నిపుణులు సైతం సలహా ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+