అమ్ముల పొదిలో శక్తిమంతమైన భార్గవాస్త్రం: బూడిద కూడా మిగలదు

Bhargavastra: మహాభారతంలో వినియోగించిన అపార శక్తిసంపన్నమైన 11 అస్త్రాల్లో ఒకటి.. భార్గవాస్త్రం. దీన్ని బ్రహ్మ శీర్షాస్త్రంతో సమానమైనదిగా భావిస్తారు. ప్రపంచం మొత్తాన్నీ నాశనం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు దీనికి ఉన్నాయని నమ్ముతారు. ఒక్కసారి దీన్ని ప్రయోగించితే బూడిద కూడా మిగలదు.

బ్రహ్మాస్త్రం, బ్రహ్మశీర్షాస్త్రం, బ్రహ్మండాస్త్రం, నాగాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం, మహేశ్వరాస్త్రం, వాసవీ శక్తి, వారుణాస్త్రం, భార్గవాస్త్రం, గాండీవం- ఈ అస్త్రాలను మహా భారతంలో వినియోగించినట్లు పురాణాలు చెబుతున్నాయి. వీటన్నింట్లో- బ్రహ్మాస్త్రాన్నీ, బ్రహ్మశీర్షాస్త్రాన్ని కూడా నాశనం చేయగలిగిన శక్తి ఉన్నది భార్గవాస్త్రానికే. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులపై ద్రోణాచార్యుడు ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. ఆ తరువాత పరశురాముడు దీన్ని ప్రయోగించారు.

India has tested its first micro-missile system Bhargavastra to take swarm drones

అలాంటి శక్తిమంతమైన పేరుతో దేశ రక్షణ వ్యవస్థలో ఓ సరికొత్త క్షిపణి వచ్చి చేరింది. మైక్రో- మిస్సైల్ సిస్టమ్ ఇది. డ్రోన్ తరహా దాడులను అడ్డుకోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖ దీన్ని అభివృద్ధి చేసింది. తాజాగా- దీన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ టెస్ట్ ఫైర్ సక్సెస్ అయినట్లు వెల్లడించింది.

లెబనాన్, గాజాల్లో హెజ్బొల్లా, హమాస్ మిలిటెంట్ గ్రూపులను నామరూపాల్లేకుండా మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్.. డ్రోన్లతో దాడులను నిర్వహించిన విషయం తెలిసిందే. శక్తిమంతమైన డ్రోన్లను ప్రయోగించింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ. బరువైన పేలుడు పదార్థలను కూడా అవలీలగా మోసుకెళ్లగలిగాయవి.

అలాంటి డ్రోన్ దాడులను ధీటుగా ఎదుర్కొనడానికి మైక్రో మిస్సైల్ వ్యవస్థను అభివృద్ధి చేసింది రక్షణ శాఖ. ఇప్పటివరకు ఈ తరహా అత్యాధునిక వ్యవస్థ ఆర్మీలో లేదు. కౌంటర్ డ్రోన్ సిస్టమ్ అందుబాటులో ఉన్నప్పటికీ- ఇందులో భాగంగా మైక్రో మిస్సైల్స్‌ను డెవలప్ చేయడం అనేది ఇదే తొలిసారిగా భావిస్తోన్నారు.

ఒడిశాలోని గోపాల్‌పూర్ సీవర్డ్ ఫైరింగ్ రేంజెస్ సెంటర్‌లో ఈ నెల 12వ తేదీన ఈ మైక్రో మిస్సైల్స్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఆర్మీ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా విడుదల చేసింది. సోలార్ గ్రూప్, ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ దీన్ని సంయుక్తంగా డెవలప్‌ చేశాయి.

2,500 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఈ మిస్సైల్ ఛేదించింది. ఈ క్రమంలో 400 మీటర్ల ఎత్తులో ఇది ప్రయాణించింది. ఆరు కిలోమీటర్ల దూరం నుండి మైక్రో డ్రోన్లను కూడా ఇది ట్రాక్ చేయగలదు. ఏకకాలంలో 64 కంటే ఎక్కువ మైక్రో మిస్సైల్స్‌ను ధ్వంసం చేయగలదు. ఖచ్చితత్వం దీని సొంతం. ఈ వ్యవస్థకు భార్గవాస్త్రం అని పేరు పెట్టారు. మహాభారతంలో ప్రయోగించిన అస్త్రాల నుండి ప్రేరణ పొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+