సిగ్నల్ లేకపోయినా కాల్స్.. రూ.6,799 Infinix Smart 10 5G !
చిన్నా, పెద్ద తేడా లేకుండా మొబైల్స్ అంటే అందరికీ ఇష్టం విపరీతంగా పెరిగిపోయింది. ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితులు కూడా భవిష్యత్తులో వస్తాయేమో అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత మార్కెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ భారీగా పెరుగుతోంది. కస్టమర్లను పెంచుకోవడానికి ప్రముఖ కంపెనీలు కూడా తక్కువ బడ్జెట్ లో సైతం అదిరిపోయే ఫీచరను తీసుకొస్తున్నాయి.
ఇప్పుడు లేటెస్ట్ గా టెక్ ప్రపంచాన్ని ఆకట్టుకునేందుకు Infinix తాజాగా smart 10 5G స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈరోజు ( జూలై 25, 2025 ) ఈ ఫోన్ అధికారికంగా మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం Flipkartలో, ఆగస్టు 2 నుంచి అన్ని ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

Infinix smart 10 5G ఫీచర్లు..
ధర..
భారతదేశంలో Infinix Smart 10 ధర రూ. 6,799. ఇది ప్రస్తుతం 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది.
కలర్స్..
ఈ ఫోన్ ఐరిస్ బ్లూ, స్లీక్ బ్లాక్, టైటానియం సిల్వర్, ట్విలైట్ గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
సిగ్నల్ లేకపోయినా కాల్స్..
ఈ ఫోన్ అల్ట్రాలింక్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. దాంతో నెట్‌వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాలు, పూర్తిగా నెట్‌వర్క్ కవరేజీ లేని ప్రాంతాల నుంచి కూడా కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఇన్ఫినిక్స్ టూ ఇన్ఫినిక్స్ ఫోన్‌లలో మాత్రమే ఇది పని చేస్తుంది.
డిస్‌ప్లే & డిజైన్..
Infinix Smart 10లో 6.67-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. పంచ్-హోల్ డిజైన్‌తో వచ్చే ఈ స్క్రీన్ గేమింగ్ మరియు స్ట్రీమింగ్ కోసం స్మూత్ అనుభవాన్ని ఇస్తుంది. స్క్రాచ్‌లకు నిరోధకంగా ఉండే బ్యాక్ ప్యానెల్ కూడా ఇందులో ప్రత్యేకత.
ప్రాసెసర్..
ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ Unisoc T7250 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది.
సాఫ్ట్ వేర్..
ఇది Android 15 ఆధారిత XOS 15.1తో నడుస్తుంది.
స్టోరేజ్..
ఇందులో 4GB LPDDR4x RAM, 64GB అంతర్గత స్టోరేజ్ అందించబడింది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు.
AI..
ఇందులో Folax AI వాయిస్ అసిస్టెంట్, AI వాల్‌పేపర్ జనరేటర్, AI నోట్స్, ఒకే ట్యాప్‌తో యాక్టివేట్ చేసే AI బటన్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.
కెమెరా సెటప్..
ఫోటోగ్రఫీ కోసం 8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇది 2K వీడియో రికార్డింగ్ కు మద్దతు ఇస్తుంది. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించబడింది. పోర్ట్రెయిట్ మోడ్, బ్యూటీ మోడ్ మరియు నైట్ మోడ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
బ్యాటరీ & ఛార్జింగ్..
Infinix Smart 10లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 40 గంటల టాక్‌టైమ్, 100 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, మరియు 28 రోజుల స్టాండ్‌బై టైమ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు..
IP64 రేటింగ్ తో దుమ్ము మరియు నీటి నుండి రక్షణ.
TÜV SÜD ధృవీకరణతో 4 సంవత్సరాల పాటు లాగ్-ఫ్రీ పనితీరు హామీ.
డ్యూయల్ స్పీకర్లు DTS ఆడియో సపోర్ట్‌తో మెరుగైన సౌండ్ అనుభవాన్ని ఇస్తాయి.












Click it and Unblock the Notifications