"స్పేస్ వాక్" అంటే ఏంటి ? నేడు "ఐఎస్ఎస్"‌లో ఏం జరగనుందంటే ??

అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారికి స్పేస్‌వాక్ అనేది ఎప్పటికీ ఆసక్తికరమైన అంశమే. భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో, శూన్యంలో తేలియాడుతూ వ్యోమగాములు చేసే పనులే స్పేస్‌వాక్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నిర్వహణ నుంచి శాస్త్రీయ పరిశోధనల వరకు కీలకమైన పనులన్నీ ఈ స్పేస్‌వాక్ ద్వారానే జరుగుతాయి. నేడు ఈ ఏడాదిలో తొలి స్పేస్‌వాక్ నిర్వహించనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో జరిగే ఈ స్పేస్‌వాక్‌లో నాసాకు చెందిన వ్యోమగాములు మైక్ ఫిన్కే, జెనా కార్డ్‌మన్ పాల్గొననున్నారు. దీంతో ఈ వ్యవహారం ట్రెండింగ్ గా మారింది.

భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై సుమారు ఆరు గంటల 30 నిమిషాల పాటు కొనసాగనుంది. కాగా ఈ స్పేస్‌వాక్ మైక్ ఫిన్కేకు 10వది కావడం విశేషం. ఇప్పటికే ఎన్నో కీలక స్పేస్ మిషన్లలో పాల్గొన్న ఆయనకు ఇది మరో మైలురాయి. మరోవైపు జెనా కార్డ్‌మన్‌కు ఇది తొలి స్పేస్‌వాక్. తొలి సారిగా అంతరిక్ష కేంద్రం బయటకు అడుగుపెట్టనున్న ఆమెకు ఇది జీవితంలో మరచిపోలేని అనుభవంగా నిలవనుంది.

interesting-detais-about-today-space-walk-in-international-space-station

స్పేస్‌వాక్‌లో చేయబోయే ముఖ్య పనులు..

ఈ స్పేస్‌వాక్ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పలు కీలక పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా ISS పవర్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త సోలార్ అరేలకు అవసరమైన కేబుల్స్ అమరిక, జంపర్ కేబుల్స్ ఇన్‌స్టాల్ చేయడం వంటి సాంకేతిక పనులు జరగనున్నాయి. అంతేకాదు, అంతరిక్ష కేంద్రం వెలుపల ఉన్న హార్డ్‌వేర్‌ను ఫోటోలు తీయడం, భవిష్యత్ పరిశోధనల కోసం సూక్ష్మజీవుల నమూనాలు సేకరించడం కూడా ఈ స్పేస్‌వాక్‌లో భాగంగా ఉంటుంది. ఈ పరిశోధనలు భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాలు, దీర్ఘకాల మిషన్లకు చాలా ఉపయోగపడతాయని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

స్పేస్‌వాక్ టైమింగ్ & వ్యవధి..

ఈ స్పేస్‌వాక్ అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు.. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 PM ISTకు ప్రారంభమవుతుంది. సుమారు 6 గంటల 30 నిమిషాల పాటు ఈ స్పేస్‌వాక్ కొనసాగనుంది.

లైవ్‌గా ఎక్కడ చూడొచ్చు?

ఈ స్పేస్‌వాక్‌ను ప్రపంచవ్యాప్తంగా లైవ్‌గా వీక్షించవచ్చు. NASA App, NASA YouTube Channel, NASA TV, Amazon Prime Video ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.

స్పేస్‌వాక్ అంటే ఏమిటి?

స్పేస్‌వాక్ అంటే వ్యోమగాములు అంతరిక్ష నౌక లేదా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) బయటకు వెళ్లి చేసే పనులు. దీన్ని సాంకేతికంగా ఎక్స్‌ట్రా-వీహిక్యులర్ యాక్టివిటీ (EVA) అని కూడా అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనదే కాకుండా, అత్యంత ఖచ్చితత్వం అవసరమైన ప్రక్రియ.

స్పేస్‌వాక్ ఎందుకు చేస్తారు?

  • నిర్వహణ & మరమ్మతులు: పాడైన భాగాలను సరిచేయడానికి
  • శాస్త్రీయ పరిశోధనలు: కొత్త పరికరాలు అమర్చడం, నమూనాలు సేకరించడం
  • భవిష్యత్ మిషన్లు: ఉపగ్రహాలు, చంద్ర-మంగళ మిషన్లకు అవసరమైన పరీక్షలు

ఇతర వ్యోమగాములకు సహాయం చేయడం

చరిత్రలో తొలి స్పేస్‌వాక్ & ఇండియా పాత్ర..

ప్రపంచంలో తొలి స్పేస్‌వాక్‌ను సోవియట్ వ్యోమగామి అలెక్సీ లియోనోవ్ 1965లో నిర్వహించారు. అప్పటి నుంచి స్పేస్‌వాక్‌లు అంతరిక్ష విజ్ఞానంలో కీలక భాగంగా మారాయి. భారతీయ మూలాలు కలిగిన వ్యోమగామి సునీత విలియమ్స్ అనేక విజయవంతమైన స్పేస్‌వాక్‌లు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె చేసిన స్పేస్‌వాక్‌లు నాసా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.

ఇక స్పేస్‌వాక్ సమయంలో వ్యోమగాములు ప్రత్యేకంగా రూపొందించిన స్పేస్‌సూట్ ధరిస్తారు. ఈ సూట్ ఆక్సిజన్ సరఫరా, ఉష్ణోగ్రత నియంత్రణ, రేడియేషన్ రక్షణ, కమ్యూనికేషన్ వ్యవస్థ సహా అన్నింటినీ అందిస్తూ వ్యోమగాముల ప్రాణాలను కాపాడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+