ఐ ఫోన్ 17 ఎయిర్ ఫీచర్స్ లీక్.. మామూలుగా లేవు గురూ !
టెక్ దిగ్గజం యాపిల్ రూపొందించే ఐఫోన్ లకు మార్కెట్ లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారుల నమ్మకాన్ని పొందింది ఐ ఫోన్. కెమెరా, శక్తివంతమైన చిప్‌సెట్, సురక్షితమైన iOS సిస్టమ్‌తో ఐఫోన్ మార్కెట్ ని పెంచుకుంటుంది. డిజైన్ పరంగా చూస్తే, ఇది ఎంతో స్టైలిష్‌గా, ప్రీమియంగా ఉండే ఈ ఫోన్లు.. కొత్త సిరీస్ ని లాంఛ్ చేయడం ఆలస్యం క్షణాల్లోనే సేల్స్ అయిపోతుంటాయి.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఐఫోన్ 17 సిరీస్ నుంచి లాంఛ్ కానున్న మొబైల్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఐఫోన్ 17 ఎయిర్ పేరుతో సెప్టెంబరులో లాంచ్ అయ్యే అవకాశం ఉన్న ఈ ఫోన్లకి ఫీచర్స్ లీకవ్వడంతో ఇప్పటి నుంచే భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ ఫోన్ వ్యవహారం ప్రస్తుతం టెక్ కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారింది. ఆ ఫీచర్స్ ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

ఐఫోన్ 17 ఎయిర్ ఫీచర్స్..
కొరియన్ బ్లాగ్ నావెర్‌లో "yeux1122" అనే అకౌంట్ ద్వారా వెలువడిన లీక్ ప్రకారం.. ఈ ఏడాది అత్యంత సన్నని ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అత్యంత సన్నని, తేలికైన ఐఫోన్ గా 17 ఎయిర్ ని రూపొందిస్తున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఐఫోన్ 17 ఎయిర్ బరువు సుమారు 145 గ్రాములు, మందం కేవలం 5.5 మిల్లీమీటర్లు మాత్రమేనని అంటున్నారు. ఇది గనుక నిజమైతే, ఇప్పటి వరకూ విడుదలైన ఐఫోన్‌ల్లో ఇది అత్యంత సన్నగా ఉండే ఫోన్ ఇదే అవుతుంది. గతంలో వచ్చిన ఐఫోన్ SE 2 లేదా 13 మినీ మోడళ్లను బీట్ చేస్తుందని భావిస్తున్నారు.
బ్యాటరీ సామర్థ్యం..
అయితే ఈ డిజైన్ బ్యాటరీ విషయంలో కొంచెం మైనస్ అనిపిస్తుంది. లీకుల ప్రకారం, ఐఫోన్ 17 ఎయిర్‌లో 2,800mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది 6.6-అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఉన్న ఫోన్‌కు సరిపోదని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే యాపిల్ హై-డెన్సిటీ బ్యాటరీ టెక్నాలజీ ఉపయోగిస్తుండటం వల్ల, నిజమైన పనితీరు 15-20 శాతం మెరుగ్గా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిమితిని దృష్టిలో పెట్టుకుని యాపిల్ ప్రత్యేకమైన బ్యాటరీ కేస్‌ను ఆప్షనల్‌గా అందించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
కెమెరా..
ఐఫోన్ 17 ఎయిర్‌లో ఉల్ట్రా-వైడ్ కెమెరా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. 48MP రియర్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉంటాయని సమాచారం.
ఇతర ఫీచర్లు..
A19 బయోనిక్ చిప్‌సెట్ ఉండే అవకాశం.
6.6 అంగుళాల AMOLED డిస్‌ప్లే తో వచ్చే అవకాశం ఉంది.
కొత్త C1 మోడెం తో బ్యాటరీ సేవింగ్ మెరుగవవచ్చు.
లాంచ్ తేదీ..
గతంలో లాగే ఈ ఏడాది కూడా సెప్టెంబర్‌లో తన ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేయనుంది. ప్లస్ మోడల్ స్థానంలో ఈసారి ఐఫోన్ 17 ఎయిర్ రావొచ్చు. తాజా లీక్‌ల ప్రకారం సెప్టెంబర్ 18 లేదా 19 తేదీల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ధర..
ధర విషయానికి వస్తే ఇది సుమారు రూ. 90,000 ప్రారంభ ధర వద్ద ఉండవచ్చని ఊహిస్తున్నారు.
మొత్తానికి ఈ లీక్స్ ప్రకారం సన్నని డిజైన్, తక్కువ బరువు, హై-ఎండ్ ఫీచర్లు అన్నీ కలిపి ఐఫోన్ 17 ఎయిర్ టెక్ ప్రియులకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications