ఐఫోన్ 17 ధరలు లీక్స్.. ఈసారి జేబుకి చిల్లు ఖాయం !
ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారుల నమ్మకాన్ని పొందింది టెక్ దిగ్గజం యాపిల్. మార్కెట్లో యాపిల్ ఐఫోన్ లకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంటుంది. తాజా లీకుల ప్రకారం ఐఫోన్ 17 ప్రో ధర మునుపటి మోడల్ కంటే $50 (సుమారు రూ.4,200) ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని టిప్‌స్టర్ ఇన్‌స్టంట్ డిజిటల్ Weibo వేదిక ద్వారా వెల్లడించారు. అమెరికాలో ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర $1,049 గా ఉండవచ్చని అంచనా.
బేస్ స్టోరేజ్‌లో మార్పు..
అంతే కాకుండా లీక్ ప్రకారం ఐఫోన్ 17 ప్రోలో బేస్ స్టోరేజ్ 128GB నుంచి 256 GBకి పెరుగుతుంది. కొనుగోలుదారులు ఎక్కువ స్టోరేజ్‌ను అదనపు ఖర్చు లేకుండా పొందే అవకాశం ఉంది. ఇది ఫోటోలు, వీడియోలు, 4K రికార్డింగ్, AI ఆధారిత యాప్స్ ఉపయోగించే వారికి ఉపయోగకరంగా మారుతుంది.

ధర పెంపు కారణాలు..
ఈ ధర పెంపు ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల, అధునాతన హార్డ్‌వేర్ భాగాల వినియోగం, అంతర్జాతీయ వాణిజ్య సుంకాలు వంటి కారణాల వల్ల అని భావిస్తున్నారు . ముఖ్యంగా అమెరికా తాజాగా చైనాలో తయారైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 30% సుంకం విధించిన నేపథ్యంలో ఈ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది.
భారతీయ ధరల అంచనా..
iPhone 17 Air - అమెరికా ధర $949 ⇒ భారతీయ ధర సుమారు రూ.94,900 (ప్రస్తుత ప్లస్ మోడల్ కంటే రూ.5,000 ఎక్కువ)
iPhone 17 Pro - అమెరికా ధర $1,049 ⇒ భారతీయ ధర సుమారు రూ.1,21,900
iPhone 17 Pro Max - అమెరికా ధర $1,249 ⇒ భారతీయ ధర సుమారు రూ.1,39,900 (iPhone 16 Pro Max కంటే రూ.5,000 ఎక్కువ)
మోడల్స్..
ఈ సారి ఆపిల్ నాలుగు మోడల్స్‌ను ఆవిష్కరించనుంది:
iPhone 17
iPhone 17 Air (ప్లస్ మోడల్ స్థానంలో రావచ్చని పుకారు)
iPhone 17 Pro
iPhone 17 Pro Max
డిజైన్ & హార్డ్‌వేర్ మార్పులు
iPhone 17 Pro & Pro Max - పెద్ద కెమెరా ఐల్యాండ్, మెరుగైన జూమ్ సామర్థ్యం.
iPhone 17 Air - ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలోనే అత్యంత సన్నని మోడల్.
iPhone 17 - డిజైన్ మార్పులు తక్కువగా ఉండే అవకాశం.
A19 Pro Bionic చిప్, 3nm ఆర్కిటెక్చర్, మెరుగైన AI ప్రాసెసింగ్ సామర్థ్యాలు ఉండవచ్చని అంచనా.
కెమెరా అప్‌గ్రేడ్స్..
Pro మోడల్స్‌లో 48MP ప్రైమరీ సెన్సార్, అల్ట్రా వైడ్, మరియు టెలిఫోటో పెరిస్కోప్ జూమ్ లెన్స్ వంటి ఫీచర్లు ఉండవచ్చు. 8K వీడియో రికార్డింగ్, ProRes HDR, మెరుగైన నైట్ మోడ్ కూడా వచ్చే అవకాశం ఉంది.
లాంచ్ తేదీ & ప్రీ-ఆర్డర్..
అధికారిక ఆవిష్కరణ 2025 సెప్టెంబర్ 9న జరిగే అవకాశం ఉంది. అదే వారం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయి. అధికారిక విక్రయాలు సెప్టెంబర్ చివరినాటికి మొదలవుతాయని అంచనా.
ఈ ధరలు, ఫీచర్లు లీకుల ఆధారంగా మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు. అధికారిక ప్రకటన వరకు వీటిని అంచనాలుగా మాత్రమే పరిగణించాలని చెబుతున్నారు. కానీ లీకులు సూచిస్తున్న విధంగా ఉంటే.. మాత్రం ఐఫోన్ 17 ప్రో సిరీస్ ఇప్పటివరకు వచ్చిన ఐ ఫోన్ లలో అత్యంత శక్తివంతమైన, ఖరీదైన వాటిలో ఒకటిగా నిలవడం ఖాయమంటున్నారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications